శ్రీ ప్రహ్లాదవరద స్వామి తెప్ప తిరునాళ్ళు….మొదటి రోజు
Sri Prahladhavarada swamy theppa thirunaal….Day 1
అలసినవేళ విభునకు నేడే తెప్పతిరునాళ్ళు
సాలుకు ఒకపరి జేసేరు తెప్పతిరునాళ్ళు
పాల కడలిలోన పాము పై పడుకొన్నవేళ
అల బ్రహ్మాదులు జేసేరు తెప్పతిరునాళ్ళు
బాలుడై మర్రాకు మీద పవళించినపుడు
కాలచక్రము జేసేను తెప్పతిరునాళ్ళు
కమఠమై కొండను మోపున మోచినపుడు
అమరులెల్ల జేసేరు తెప్పతిరునాళ్ళు
యమునలోన కాళింగుని పై నర్తించు వేళ
గోముతో గోపికలు జేసేరు తెప్పతిరునాళ్ళు
సుధావల్లి మేని చెమటలోన ఓలలాడు వేళ
మదనుడు మంచము పై జేసేను తెప్పతిరునాళ్ళు
ఎద పుష్కరిణిలోన సదా ప్రహ్లాదవరదునికి
పద దాసులెల్ల గొప్పగా జేసేరు తెప్పతిరునాళ్ళు
.Today is theppothsavam to the lord who is tired.
once in every year they will do theppothsavam.
when the lord is sleeping on a snake in ksheeraabdi, brahmaadi devas do theppa thirunaal.
when the lord is sleeping on a vata patram, time has done theppa thirunaal.
When the lord has lifted mountain on his back like as a tortise,all the devas do theppa thirunaal.
When the lord is dancing on kalinga snake in yamuna river,with full of affection has done theppa thirunaal.
When the lord is swimming in the ocean of sweat of Amruthavalli, manmadha is doing theppa thirunaal.
All the dasas are doing theppa thirunaal always to Prahladhavarada in their pushkarini like heart.