* తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విజయవాడలోని కనకదుర్గమ్మ దర్శనానికి, మొక్కులు తీర్చుకొనేందుకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కుటుంబ సభ్యులు తో కలిసి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో తెలంగాణ ముఖ్యమంత్రికి స్వాగతం పలికిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఇంచార్జ్ కలెక్టర్ విజయ కృష్ణ, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, తెలంగాణ ప్రతినిధులు , విజయవాడలో ని గేట్ వే హోటల్ లో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు, వారి కుటుంబ సభ్యులకు స్వాగతం పలికిన ఆంధ్రప్రదేశ్ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ , ఇంచార్జి కలెక్టర్ విజయ కృష్ణ, జేసీ 2 బాబూరావు, ప్రోటోకాల్ అధికారులు తదితరులు.
*గురువారం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కుటుంబ సభ్యులతో కలిసి విజయవాడ కనకదుర్గమ్మ దర్శనం చేసుకున్నారు. ముక్కు పుడక అమ్మవారికి సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు.