వసుధ జనులకు సుధలు పంచే తేరు

courtesy: kidambi sethu raman

అహోబిలంలో ఘనఘనంగా శ్రీ ప్రహ్లాదవరదుల రథోత్సవం

అహోబిల మఠం పరంపరాధీన
శ్రీ ఆదివన్ శఠగోప యతీంద్ర మహాదేశిక
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం
అహోబిలం

Sri Ahobila math paramparaadheena
Sri mad Aadivan satagopa yatheendra mahadesika
Sri Lakshmi Narasimha swamy devasthaanam
Ahobilam.

Sri Prahladhavarada swamy Rathothsavam
: వీధి వీధి తిరిగేనదే దేవదేవుని తేరు
మోదముతో జనులాల మొక్కరో మీరు
వేదములు చక్రములైయున్న తేరు
విధాత సారథియై నడుపు తేరు
భూదేవీ పీఠమై నిలిచియున్న తేరు
సాధు జనుల చెంతకు వచ్చే తేరు
దిక్కులే నాలుగు ద్వారములైన తేరు
చుక్కలు చక్కని తోరణములైన తేరు
రక్కస కూష్మా0డములను తొక్కు తేరు
అక్కరకు వచ్చి మనల గాచే శ్రీదేవిని తేరు
దాసుల మనస్సు అశ్వములైన తేరు
విశాలాకాశము తెల్లని ఛత్రమైన తేరు
వసుధ జనులకు సుధలు పంచే తేరు
కొసరి పరిగెత్తు ప్రహ్లాదవరదుని తేరు
.
This is ratham rounding in streets.you all with all pleasure offer prayers to this ratham.
Four Vedas are wheels to this ratham.
Brahma is sarathy to this ratham.
Bhoodevi is adhistaana peetam to this ratham.
This is ratham coming near to all good people.
Four directions are four dwarams to this ratham.
Stars are thoranam to this ratham.
This ratham is crushing all asuras like kushmaandam (pumpkin).
This is the ratham that comes to our rescue when we are in need.
Hearts of dasas are horses to this ratham .
Sky is the white umbrella to this ratham.
This ratham is giving amrutham to all the people on earth.
This is the great ratham of sri Prahladhavarada
print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.