నగరంలో కురిసిన భారీ వర్షాలు, సహాయక చర్యలపైన పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈరోజు సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ, జలమండలి అధికారులు పాల్గోన్నారు. నిన్నటి నుండి కురుస్తున్న భారీ వర్షాల వల్ల నగర ప్రజలకు ఏవిధమైన ఇబ్బందులు రాకుండా ఉండేందుకు జీహెచ్ఎంసీ, వాటర్ బోర్ద్ లు చురుగ్గా సహాయక చర్యలు చేపడుతున్నారని తెలిపారు. ఇప్పటికే నగరంలో జీహెచ్ఎంసీకి చెందిన 140 మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు, 50 స్టాస్టిక్ బృందాలు నిరంతరం సహాయక చర్యలు చేపడుతున్నాయని తెలిపారు. నీళ్లు నిలిచిన ప్రాంతాల్లో కాలువలు, నాలాలను క్లియర్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. జీహెచ్ఎంసీలో ఏర్పాటుచేసిన కంట్రోల్‌రూం ద్వారా నగరంలోని పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం సీసీ టీవిలు, డయల్ 100, జీహెచ్ఎంసీ కాల్‌సెంటర్, మై జీహెచ్ఎంసీ యాప్ ద్వారా వస్తున్న ఫిర్యాదుల మీద ప్రత్యేకంగా దృష్టి సారించాలని మంత్రి అధికారులకు అదేశాలు జారీ చేశారు. భారీ వర్షాలకు పాడయిన రోడ్లను వెంటనే తిరిగి పునరుద్దరించాలని మంత్రి జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ సిబ్బందికి అదేశాలు జారీ చేశారు. రాబోయే రెండు రోజుల పాటు మరిన్ని వర్షాలు పడనున్న నేపథ్యంలో అధికారులంతా మరింత జాగ్రత్తగా ఉండాలన్నారు. విరిగిపడిన భారీ వృక్షాలను తొలగించి, వెంటనే విద్యుత్ సరఫరా చేయాలని ఇందుకోసం విద్యుత్ శాఖతో సమన్వయం చేసుకోవాలన్నారు.ఈరోజు వివిధ శాఖల సమన్వయం కోసం ఉదయం జీహెచ్ఎంసీ, పోలీస్, వాటర్ వర్క్స్, ట్రాఫిక్, విద్యుత్ శాఖాధికారులు సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి జీహెచ్ఎంసీ కమిషనర్ డా.బి.జనార్థనరెడ్డి, నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి, జలమండలి ఎండి దానకిషోర్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ యోగితారాణాతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రికి జీహెచ్ఎంసీ కమీషనర్ వివరించారు. కరెంట్ షాక్ తగిలి చనిపోయిన వ్యక్తికి నాలుగు లక్షలు విద్యుత్ శాఖ ద్వారా, గోడకూలి మరణించిన ఇద్దరికి జీహెచ్ఎంసీ తరపున రెండు లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియ ప్రకటించినట్టు మంత్రి తెలిపారు.
జలమండలి తరపున తీసుకున్న సహాయక చర్యలను మంత్రికి జలమండలి యండి దానకిషోర్ వివరించారు. జలమండలి తీసుకుంటున్న చర్యలు కింది విధంగా ఉన్నాయి.• రాబోయే 72 గంటల్లో ఏమర్జెన్సీ సెల్ ఏర్పాటు, ప్రస్తుతం ఉన్న కాల్ సెంటర్ కు అధనంగా ఈ సెల్ పనిచేస్తుంది. ఈ సెల్ కు కాల్ చేయాల్సిన నంబర్- 9989996948
• ప్రస్తుతం పనిచేస్తున్న అన్ని ఏయిర్ టెక్ మెషీన్లు రాబోయే 72 గంటల పాటు 24 గంటలు పనిచేస్తాయి.
• వర్షాలు అధికంగా పడిన ప్రాంతాల్లో జలమండలి యండి, డైరెక్టర్లు స్వయంగా పర్యటించి సహాయక చర్యలను పర్యవేక్షిస్తారు.
• లోతైన మ్యాన్ హోల్స్ ఉన్న చోట్ల ముందస్తు జాగ్రతగా ఏర్ర జెండాలు, గుర్తింపు బోర్డులు ఏర్పాటు చేస్తాం.
• ముగ్గురు జీ.యం. లు, ఇద్దరు డీ.జీ.యం.లు, ముగ్గురు మేనేజర్లు ప్రత్యేకంగా జీహెచ్ఎంసీ కంట్రోల్ రూంలో మూడు షిప్టుల వారిగా పనిచేస్తారు.
• నీళ్లు నిండిన ప్రాంతాల్లో క్లోరీన్ మాత్రలతోపాటు, జల మండలి తరపున నీటి ప్యాకెట్లు సరఫరా చేస్తారు.
జీహెచ్ఎంసీ తీసుకున్న సహాయక చర్యలు
• జీహెచ్ఎంసీలో ప్రత్యేక ఏమర్జెన్సీ సెల్ ఏర్పాటు
• సీసీ టీవిలు, డయల్ 100, జీహెచ్ఎంసీ కాల్‌సెంటర్, మైజీహెచ్ఎంసీ యాప్ ద్వారా వస్తున్న పిర్యాదుల మీద ప్రత్యేకంగా దృష్టి
• జీహెచ్ఎంసీకి చెందిన 140 మన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు, 50 స్టాస్టిక్ బృందాలు నిరంతరం సహాయక చర్యలు
• కాల్ సెంటర్ 100 తో అన్ని పిర్యాదుల స్వీకరణ
•