దేశం గర్వించ తగ్గట్టుగా వంగరను గొప్ప చారిత్రాత్మక పర్యాటక కేంద్రంగా తీర్చి దిద్దేందుకు కావల్సిన ప్రణాళికలు తయారు చేయనున్నట్లు రాష్ట్ర ప్రోహిబిషన్ & ఎక్సైజ్, క్రీడలు ,యువజన సంక్షేమం, టూరిజం, కల్చర్ ఆర్కియాలజీ శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు.
పీవీ నరసింహా రావు శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని భావితరాల వారు గుర్తుంచుకునే విధంగా దేశం లో ఆదర్శంగా నిలిచేందుకు పి వి గారి సొంత గ్రామం ప్రపంచస్థాయి లో గుర్తింపు తెవాలనేదే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం అన్నారు.
ముఖ్య మంత్రి ఆదేశాలు మేరకు తాను టూరిజం, సాంస్కృతిక శాఖ సెక్రెటరీ. కే యస్ శ్రీనివాస్ రాజు, రాష్ట్ర టూరిజం శాఖ ఏం డి మనోహర్ , సాంస్కృతిక శాఖ డైరెక్టర్ హరికృష్ణ , శిల్ప రామం ఈ ఈ అంజి రెడ్డి, ఆర్కియలోజి డి డి నారాయణ వంగర ను సందర్చించి పర్యటక కేంద్రం- కు కావలసిన అన్ని ఏర్పాట్ల పై పి వి బంధువులతో చర్చించి నిర్ణయం తీసుకున్నామని మంత్రి విలేఖరుల సమావేశం లో వెల్లడించారు.ఆర్థిక , రాజకీయ, భూ సంస్కరణలు చేసి నిరుపేదల సంక్షేమం కోసం పాటుపడిన గొప్ప వ్యక్తి PV అని అన్నారు . తెలంగాణ గడ్డ నుండి పట్వారీ నుండి ప్రధాన మంత్రి వరకు ఎదిగిన వ్యక్తి , భూసంస్కరణలు చట్టం చేసి మొట్ట మొదటగా తన 1000 ఏకరాల భూమిని పేదలకు పంపిణీ చేసిన ఘనత పి వి కి దక్కిందని అన్నారు.
తెలంగాణ గడ్డ పై పుట్టిన P V గొప్పతనాన్ని ప్రపంచ స్థాయిలో, దేశ వ్యాప్తంగా నలుమూలల వ్యాపింప చేయడానికి ముఖ్యమంత్రి అన్ని చర్యలు తీసుకున్నారని మంత్రి అన్నారు. రాజకీయంగా ఎన్నో పదవులు ఎంతో ఉన్నత స్థానం లో చివరికి ప్రధానమంత్రి గా పాలించిన పి విసామాన్య జీవితాన్ని అనుభవించరాన్నారు.
పి వి మరణాంతరం ఏ ప్రభుత్వం పట్టించుకోలేదని, పార్లమెంటులో కూడా ఫోటో కూడా పెట్టలేక పోయారాన్నారు. ప్రపంచ స్థాయిలో పి వి ఖ్యాతిని తెచ్చేందుకు కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. పి వి పుట్టి పెరిగిన లక్నేపల్లి, వంగార గ్రామాలను ప్రజలకు తెలియజేసేందుకు మంచి టూరిజం కేంద్రంగా అభివృద్ది చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని అన్నారు. రాష్ట్రం నలుమూల నుండి పర్యాటకులు వచ్చే విదంగా టూరిజం సర్క్యూట్ చేయనున్నట్లు చెప్పారు.
పి వి ని స్ఫూర్తి గా తీసుకోవాలని ఆయన వాడిన వస్తువుల భవిష్యత్తు తరాల వారికి తెలియజేసే విధంగా భవనాన్ని మ్యూజియం గా తీర్చిదిద్దుతామన్నారు. ప్రజల సమస్యల పై తన వద్దకు వస్తె తానే స్వయంగా టైప్ చేసి ఇచ్చేవారు. అదే విధంగా మారుతున్న సాంకేతిక పరిజ్ఞానం నేర్చుకొని కంప్యూటర్ కూడా తానే వినియోగించుకొని సమస్యలను ప్రభుత్వ దృష్టి కి తెచ్చి పరిష్కారం చేసే వారని గ్రామ ప్రజలు వివరించడం ఆయన గొప్ప తనానికి నిదర్శనం అన్నారు.
అంతకు ముందు మంత్రి, పి వి నివసించిన భవనాన్ని సందర్చించారు. రాష్ట్ర స్థాయి అధికారులతో పాటుగా జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, జడ్పీ చైర్మన్ డాక్టర్ సుధీర్ రావు, పి వి కుటుంబ సభ్యుల తో కలిసి పర్యాటక కేంద్రానికి కావసిన చర్యలు పై చర్చించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వంగర కు వచ్చినట్లు వివరించారు.
పి వి నరసింహారావు నివసించిన భవనం లో వారు వాడిన వస్తువులకు ఒక్కొక్కటి క్లుప్తంగా విషయ సమాచారం తో ఏర్పాటు చేయాలని అదే విధంగా వరంగల్ నుండి సిద్దిపెట అర్ అండ్ బి రోడ్డు గ్రామాన్ని వచ్చే రోడ్డు ను డబల్ రోడ్డు చేసి ఇరువైపులా సుందరీకరణ ప్రత్యేక ఆకర్షణ గల ప్రవేశ ద్వారం ఏర్పాటు చేయాలన్నారు. గ్రామం లో శివాలయం అభివృద్ది తో పాటు దేవాలయ చరిత్ర పొందుపర్చడం వంగర చెరువు ను మినీ ట్యాంకుబండ్ గా తీర్చిదిద్దుతామన్నారు.
చెరువులో సస్పెన్షన్ బ్రిడ్జి ,
7 ఏకరాల స్థలం లో మోడల్ పార్కు ఏర్పాటు నిర్ణయాలను సీఎం దృష్టి కి తీసుకొని వెళ్లి , ఆదేశాల మేరకు మరిన్ని నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉందన్నారు.పి వి ప్రభాకర్ రావు మాట్లాడుతూ కే సి ఆర్ మా కుటుంబ సభ్యులను పిలిచి పీ వీ గొప్పతనాన్ని స్మరించారని వివరించారు.ఈ కార్యక్రమంలో పి వి కుటుంబ సభ్యులు శ్రీమతి వాణి దేవి, పి వి ప్రభాకర్ రావు కాశ్యప్, పి వి మదన్ మోహన్ రావు, వాసుదేవ రావు, అర్ డి ఓ వాసు చంద్ర, ఎసిపి రవీందర్, తహశీల్దార్, ఎంపీడీఓ, సర్పంచ్, ఏం పి పి తదితరులు పాల్గొన్నారు.