యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో మంగళవారం నిత్య పూజలు ఘనంగా జరిగాయి. శ్రీ ఆంజనేయ స్వామి వారికి శాస్త్రోక్తంగా ఆకు పూజలు జరిగాయి. వివిధ నిత్య పూజలకు భక్తులు అధికంగా హాజరయ్యారు. దేవస్థానం వారు తగిన ఏర్పాట్లు చేసారు. అర్చక స్వాములు సంప్రదాయపరంగా పూజలు జరిపించారు.