యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయం అభివృద్ధి పనులను పరిశీలించేందుకు సీఎం కేసీఆర్ యాదాద్రి యాదాద్రికి విచ్చేసిన సందర్భంగా వేద పండితులు, అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు
ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, సీఎం కేసీఆర్ కు ఆశీర్వచనాలు అందించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి యాదాద్రిలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. రాజగోపురానికి శంకుస్థాపన చేసిన ప్రదేశాన్ని, ప్రధాన ఆలయ విస్తరణ పనులను పరిశీలించారు.
సీఎం కేసీఆర్ వెంట మంత్రి జగదీష్ రెడ్డి, విప్ గొంగిడి సునీత, ఎంపీ బూర నర్సయ్య గౌడ్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్ రావు, ఆలయ రూపశిల్పి ఆనందసాయి తదితరులు ఉన్నారు.
<
>