యాదగిరిగుట్ట మండలంలోని మోటకొండూరు, దామరచర్ల మండలంలోని అడవిదేవులపల్లి కేంద్రాలుగా కొత్త మండలాలుగా చేయాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు నిర్ణయంచారు. తుది ముసాయిదాలో ఆ రెండు మండలాల పేర్లు చేర్చాలని ఆదేశించారు. మంత్రి జగదీష్ రెడ్డి, విప్ గొంగిడి సునీత, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు తదితరులు సోమవారం క్యాంపు కార్యాలయంలో సిఎంను కలిసి విజ్ఞప్తి చేయగా, ముఖ్యమంత్రి ఈ విషయంలో సానుకూల నిర్ణయం తీసుకున్నారు.