రాష్ట్రంలో 54 లక్షల యస్.సి జనాభాకు సంబంధించిన డాటాబేస్ ను రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి సంబంధిత శాఖాధికారులను ఆదేశించారు.గురువారం సచివాలయంలో యస్.సి అభివృద్ధి శాఖపై అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో యస్.సి అభివృద్ధి శాఖ కార్యదర్శి బుద్దప్రకాశ్ జ్యోతి, యస్.సి సంక్షేమ శాఖ గురుకులాల కార్యదర్శి ఆర్.యస్. ప్రవీణ్ కుమార్, డైరెక్టర్ కరుణాకర్, యస్.సి కో ఆపరేటివ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ యం.డి లచ్చిరాం బుక్యా తదితరులు పాల్గొన్నారు.యస్.సి జనాభా డాటాబేస్ కు సంబంధించి స్కాలర్ షిప్ పోర్టల్, సెర్ప్ కార్పొరేషన్ వద్ద ఉన్న డాటాను ఇంటిగ్రేట్ చేసి సి.జి.జి ద్వారా రూపొందించాలని సి.యస్ తెలిపారు. దీని ద్వారా ప్రజల అవసరాల మేరకు పథకాలు అమలు చేయవచ్చన్నారు.