మెదక్ జిల్లా ఎర్రవెల్లి సమీపంలోని మర్కూక్ గ్రామంలో ఉన్న తన చిరకాల స్నేహితుడు మహేందర్ రెడ్డిని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు సోమవారం సాయంత్రం కలిశారు. ముఖ్యమంత్రి స్వయంగా తన ఇంటికి వచ్చినందుకు మహేందర్ రెడ్డి, కుటుంబసభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.