×

CNN- ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు గారి ఆదేశాల మేరకు దళితవాడలు, తండాల నుంచే మిషన్ భగీరథ పనులు మొదలుకావాలన్నారు పంచాయితీరాజ్ స్పెషల్ సిఎస్ ఎస్పీ సింగ్

CNN- ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు గారి ఆదేశాల మేరకు దళితవాడలు, తండాల నుంచే మిషన్ భగీరథ పనులు మొదలుకావాలన్నారు పంచాయితీరాజ్ స్పెషల్ సిఎస్ ఎస్పీ సింగ్

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు గారి ఆదేశాల మేరకు దళితవాడలు, తండాల నుంచే మిషన్ భగీరథ పనులు మొదలుకావాలన్నారు పంచాయితీరాజ్ స్పెషల్ సిఎస్ ఎస్పీ సింగ్

సామాజికంగా, ఆర్థికంగా వెనకబడ్డ వర్గాలకే ముందుగాల మిషన్ భగీరథ ఫలాలు అందాలన్నారు. హైదరాబాద్ లోని RWS&S ప్రధాన కార్యాలయంలో అన్ని జిల్లాల ఎస్.ఈ, ఈఈలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఎస్పీ సింగ్, మిషన్ భగీరథతో ఎవరూ ఊహించని సామాజిక, ఆర్థిక మార్పులు కలుగుతాయన్నారు.  ఇప్పటిదాకైన మిషన్ భగీరథ పనుల పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేసిన స్పెషల్ సిఎస్, ఇంజనీర్లు, సిబ్బంది అంకిత భావమే ఇందుకు కారణమన్నారు.

ఇంటింటికి రక్షిత నీటితో పాటు ఇంటర్నెట్ ను కూడా అందిస్తామని గణతంత్ర దినోత్సవం రోజు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు గారు ప్రకటించి, ప్రాజెక్టుకు ప్రత్యేక గుర్తింపును తెచ్చారని గుర్తుచేశారు. ఇంటింటికి ఇంటర్నెట్ తో కలిగే సామాజిక మార్పును తేలిగ్గా తీసుకోవద్దని ఇంజనీర్లకు సూచించారు. పైప్ లైన్ తవ్వకాలతో కచ్చితంగా డక్ట్ ను కూడా వేయాలన్నారు. డక్ట్ పనులపై సంతృప్తి వ్యక్తం చేసిన ఎస్పీ సింగ్, ఇంటింటికి ఇంటర్నెట్ అందించి ముఖ్యమంత్రి కేసీఆర్, ఐటీ శాఖ మంత్రి తారకరామారావు గారి డిజిటల్ తెలంగాణ కలను సాకారం చేయాలన్నారు. వర్క్ ఏజెన్సీలకు బిల్లులు చెల్లించే సమయంలో ఈ.ఈ [EE] లంతా PRICE ADJUSTMENT క్లాజ్ ను అప్లై చేయడం మరిచిపోవద్దన్నారు. దీంతో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని కాపాడిన వాళ్లు అవుతారన్నారు.

ఎఫీషియన్సీ తో పాటు ఎకానమిక్ గా కూడా ఉండాలని సూచించారు. మిషన్ భగీరథ ప్రాజెక్టులో కీలకమైన ఇంట్రా పనుల పై ప్రత్యేక దృష్టి పెడుతున్నామని స్పెషల్ సింగ్ చెప్పారు. గజ్వేల్ అనుభవంతో ఇంట్రా పనులపై సంపూర్ణ అవగాహన పెంచుకోవాలన్నారు.  ఇంట్రా పనుల్లో ఏం చేయాలి? ఏం చేయకూడదన్న విషయాలపై  క్లారిటీ ఉండాలన్నారు. ఇంట్రా పనుల వర్కింగ్ ఎస్టిమేట్స్ తయారుచేసేటప్పుడు గ్రామాల మధ్య ఉండే భౌగోళిక తేడాలను గుర్తుంచుకోవాలన్నారు. పాత పైప్ లైన్లు పూర్తిగా పాడైతేనే కొత్తవి వేయాలని, లేకుండా ఉన్నవాటితోనే ఆవాసాల్లో నీటి సరాఫరా చేయాలన్నారు.ఈ నెల 15 తారీఖు నాటికి మొత్తం వర్కింగ్ ఎస్టిమేట్స్ ను రెడీ చేయాలన్నారు.

ఇంట్రా పనుల్లో స్థానికులకే ప్రాధాన్యత ఇవ్వాలని, సర్పంచ్ ల సహకారం తీసుకోవాలని సూచించారు. పనులను వేగంగా చేయడంతో పాటు నాణ్యతతో పూర్తి చేయడంపై దృష్టి పెట్టాలన్నారు. గత పనుల్లోని నాణ్యత, భగీరథ పనుల నాణ్యతకు మధ్య ఉన్న తేడాను ప్రజలు గుర్తించి అభినందించాలన్నారు. ఇంట్రా పనుల్లో కలెక్టర్ల సహకారాన్ని తీసుకోవాలని, ప్రతీ జిల్లాకు సంబంధించిన భగీరథ సమాచారాన్ని బుక్ లెట్ రూపంలో తయారుచేసి ఆయా కలెక్టర్లకు అందించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఇంట్రా పనులు చేస్తున్న ఏఈలకు వేరే పనులు అప్పగించకుండా చూడాలని కొంతమంది ఎస్.ఈలు కోరడంతో ఆ విషయాన్ని తప్పకుండా  పరిశీస్తానని ఎస్పీ సింగ్ హామి ఇచ్చారు. అందరు కష్టపడి పనిచేసి వచ్చే సంవత్సరం డిసెంబర్ నాటికి ప్రతీ గ్రామానికి సురక్షిత మంచినీటిని అందించాలన్నారు ఎస్పీ సింగ్.

ఈ సమావేశంలో RWS&S ఈ.ఎన్.సి సురేందర్ రెడ్డి, RWS&S ప్రభుత్వ సలహాదారులు జ్ఞానేశ్వర్, స్వఛ్చ భారత్ ప్రాజెక్ట్ డైరెక్టర్ రాములు నాయక్, మిషన్ భగీరథ చీఫ్ ఇంజనీర్లు సురేష్ కుమార్, జగన్మోహన్ రెడ్డి, కృపాకర్ రెడ్డి తో పాటు కన్సల్టెంట్లు నర్సింగరావు, జగన్, మనోహర్ బాబు, కృష్ణమూర్తి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

 

 

<
>
print
Previous post

CNN- చారిత్రక కాళేశ్వరం ప్రాజెక్టును యేడాదిలోపు పూర్తిచేసి ఆసియా లోనే సరికొత్త రికార్డు నెలకొల్పాలని మంత్రి హరీశ్రావు కోరారు

Next post

CNN- పార్ల‌మెంట్ ప్రాంగ‌ణంలో ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన జీఎస్టీ కౌన్సిల్ 4 వ స‌మావేశంలో పాల్గొన్న ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్.

Post Comment

You May Have Missed