పట్టణాల్లో తాగునీరు అందించేందుకు ఉద్దేశించిన మిషన్ భగీరథ ( అర్బన్ ) పనులను ఈ ఆగస్టు మాసంలోగా పూర్తి చేయాలని వర్కింగ్ ఏజెన్సీలను పురపాలక శాఖ మంత్రి కె టి రామారావు అదేశించారు. ఈ రోజు బేగంపేట మెట్రో రైల్ భవన్లో జరిగిన మిషన్ భగీరథ అర్బన్ సమీక్షా సమావేశంలో అధికారులు, వర్కింగ్ ఎజెన్సీలతో సమీక్ష నిర్వహించారు. వివిధ పట్టణాల్లో మిషన్ భగీరథ అర్బన్ పనుల పురోగతిని ఈ సందర్భంగా మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. వచ్చే ఆగస్టు నాటికి దాదాపుగా అన్ని పైపులైన్ల నిర్మాణం పూర్తి అవుతుందని అధికారులు తెలిపారు. దీంతోపాటు వివిధ కారణాల చేత ఆలస్యం అయిన కొన్ని చోట్ల మాత్రం అక్టోబర్ మాసాంతానికి సివిల్ నిర్మాణాలు పూర్తి అవుతాయాని అధికారులు మంత్రికి తెలిపారు. ఈ సమావేశంలో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ తోపాటు, ఈఏన్ సి ( పిహెచ్) దన్ సింగ్ నాయక్, అధికారులు, వర్కింగ్ ఏజెన్సీల ప్రతినిధులు పాల్గొన్నారు .