మానకొండూరులో మంత్రి హరీశ్ రావు ప్రచారం*
– మానకొండూరు కు రెండోసారి రసమయి ఎమ్మెల్యే కావడం ఖాయం.
– మానకొండూరు నియోజకవర్గాన్ని సిద్ధిపేట తరహాలో అభివృద్ధి చేస్తాం
– మానకొండూరుకు మిడ్ మానేరుతో త్వరలో సాగునీరు .
– మూడు పంటలు పండేలా నీళ్లిస్తాం
– మూడేళ్లలో మిడ్ మానేరును పూర్తి చేసిన ఘనత సీఎందే.
*కంటి వెలుగులు పంచే కేసీఆర్ వెంట నడవండి.
– కాళేశ్వరంతో
పాత కరీంనగర్ జిల్లా మరో కోనసీమగా మారబోతోంది.
– కూటమికి ఓటేస్తే సంక్షోభమే.
– కూటమిలోని పార్టీలకే ఒకరిపై ఒకరికి నమ్మకం లేదు. మిమ్మల్ని ప్రజలెలా నమ్ముతారు.
– చంద్రబాబు ప్రాజెక్టులు ఆపాలంటున్నరు. కాళేశ్వరం కట్టవద్దంటున్నరు.
– పోలవరం కింద మూడో పంటకు గోదావరి నీళ్ళు రావని.. మన కాళేశ్వరం అడ్డుకోవాలని చంద్రబాబు చూస్తున్నడు.
– కాంగ్రెస్ వస్తే అర్ధరాత్రి కరంట్ మాత్రమే వస్తోంది.
-కల్యాణ లక్ష్మి రద్దు చేస్తారట. కాళేశ్వరం రద్దు చేస్తారట.
– రైతుల కోసం అనేక కార్యక్రమాలు తెచ్చాం. వాటిని మరింత విస్తరిస్తాం.
– ఆహార శుద్ధి కేంద్రాలను మహిళా సంఘాలతో పెట్టిస్తామని సీఎం చెప్పారు. మహిళలను లక్షాధికారులను చేయాలన్నది కేసీఆర్ ఆలోచన.
– రసమయి, నేను కలిసి పెరిగనం. ఉద్యమంలో పనిచేసినోళ్లం.
– ఆయనను గెలిపిస్తే మా చేతులు పట్టుకుని మీకు పనిచేయించి పెడ్తాడు.
కేసీఆర్ వేలు పట్టుకుని నడుస్తేనే అభివృద్ధి
– కాంగ్రెసోళ్లను గెలిపిస్తే చంద్రబాబు ముందు చేతులు కట్టుకుంటారు.
– మన ఓటు ఢిల్లీకో, అమరావతికో పోనియ్యొద్దు.
– కోదండరాం లాంటి ఉద్యమకారునికే టికెట్ ఇవ్వకుండా మోసం చేసింది కాంగ్రెస్.
– ఉద్యమంలో
తప్పించుకు తిరిగిన వాళ్లంతా ఇప్పుడు ఓట్ల కోసం వస్తున్నారు.
– తెలంగాణ కోసం మేం పదవులను గడ్డిపోచల్లా వదిలేశాం.
– జగిత్యాల సహా కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని 13 స్థానాలు గెలుస్తాం.
– కార్యకర్తలు 15 రోజుల కష్టపడితే 5 ఏళ్లు మిమ్మల్ని కళ్ల లో పెట్టుకుని చూసుకుంటాం.
– కన్ను గొట్టే రాహుల్, రెండు కళ్ల చంద్రబాబును నమ్మకండి. కంటి వెలుగులు పంచే కేసీఆర్ వెంట నడవండి.
– రసమయిని లక్ష మెజార్టీతో గెలిపించండి.