* నల్లచెరువు అలుగెల్లిన శుభ సందర్భంగా పూజలు చేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
*వనపర్తి పట్టణానికి, సంస్థానకేంద్రానికి సాగునీటి కోసం ఆనాటి సంస్థానాధీషులు కట్టించిన చెరువు* సమైక్య రాష్ట్రంలో నిరాదరణకు గురై అన్యాక్రాంతమయింది* 160 ఎకరాల చెరువు శిఖంలో దాదాపు 60 ఎకరాలలో అక్రమకట్టడాలు వెలిశాయి* ఈ చెరువులో ప్రజలు నీళ్లు చూడక దశాబ్దాలు అయిపోయింది* ఇక ఈ చెరువుకు కృష్ణా నీళ్లు చూస్తమా అన్న అపనమ్మకం ప్రజలకు ఉండేది* కృష్ణా నీళ్లు తెస్తానని ఇచ్చిన మాట నిలబెట్టుకుని నల్లచెరువును అలుగుపారించినం*వనపర్తి ప్రజల ఆకాంక్షను నెరవేేర్చినం.
– నల్లచెరువు నిండడంతో దీని కింద ఆయకట్టు భూములు సాగులోకి రావడమే కాకుండా వనపర్తి
చుట్టూ నాలుగు కిలోమీటర్ల పరిధిలో బోర్లు రీఛార్జ్ అయ్యాయి.
– పట్టణంలో మత్స్యకార కుటుంబాలు అధికంగా ఉన్నాయి .. వారికి జీవనోపాధి .
– నల్లచెరువు అలుగు పార్తోంది .. పట్టణం పరిధిలో ఉన్న తాళ్లచెరువు, ఈదుల చెరువుల పునరుద్దరణ కార్యక్రమం సాగుతుంది.
– వచ్చే వానకాలానికి ఆ రెండు చెరువులు అందుబాటులోకి తెచ్చేందుకు నిర్ణయించినం .
– ఈ మూడు చెరువులు నిండితే వీటిలోని మత్స్యసంపదతో మత్స్యకార కుటుంబాలకు సరిపడా ఉపాధి లభిస్తుంది
– పర్యాటకపరంగా, అహ్లాదకరంగానే కాకుండా మత్స్యకారులకు ఆర్థిక స్వావలంబన కలుగుతుంది.
– పట్టణానికి ఈశాన్యంలో ఉన్న చెరువు గతంలో అత్యంత దారుణంగా ఉండేది.
– ఈ రోజు రోజుకు వెయ్యిమంది చెరువు కట్టను చూసి వెళ్లి అహ్లాదాన్ని ఆస్వాదిస్తున్నారు.
– ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో వందలాది చెరువులను పునరుద్దరిస్తూ, నీటితో నింపుతూ పోతున్నాం.
– ఒక్కొక్క చెరువును నింపడాన్ని ఒక తపస్సులా భావిస్తూ పనిచేస్తున్నాం.
– ఈ రోజు పట్టణ ప్రజలతో కలిసి నల్లచెరువు అలుగుకు పూజలు చేయడాన్ని అదృష్టంగా భావిస్తున్నాను.