గుంటూరులోని లాలాపేట జగన్నాథస్వామి ఆలయానికి బదిలీపై వెళుతున్న శ్రీశైల దేవస్థానం సహాయ కమిషనర్ బి.మహేశ్వర రెడ్డికి దేవస్థానం 24 న ఆత్మీయ సత్కారం నిర్వహించింది. శ్రీ సాక్షి గణపతి స్వామికి విశేష అభిషేకం జరిగింది. శ్రీ జ్వాలా వీరభద్రస్వామి వారికి విశేష పూజలు జరిపారు. పౌర్ణమిన శ్రీస్వామి అమ్మవార్లకు ప్రత్యేక ఊయలసేవ నిర్వహించారు.