హైదరాబాద్, సెప్టెంబర్ 17:ప్రశ్నించే ప్రతి ఒక్కరినీ కేసీఆర్ నిరంకుశంగా, నియంతలా అణచివేస్తున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క మల్లు అన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ విప్ ఈరవత్రి అనిల్, మాజీ ఎమ్మెల్యేలు కోదండ రెడ్డి, కొండేటి శ్రీధర్ తదితరులతో కలిసి పాల్గొన్నారు. భట్టి విక్రమార్క మాట్లాడుతూ నాడు తెలంగాణ కు స్వాతంత్రం తీసుకొచ్చింది నెహ్రు నాయకత్వం లోని కాంగ్రెస్ పార్టీ అని ఆయన చెప్పారు. నెహ్రు నాయకత్వంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ పోలీస్ చర్య నిర్వహించి నిజాం పాలనకు ముగింపు పలికారని అన్నారు. ఆనాటి త్యాగాలు వృధాగా పోకుండా చూసేందుకు కాంగ్రెస్ పార్టీ శ్రమిస్తోందని అన్నారు.
మన నిధులు మనకోసమే:
మరొక్కసారి మన నిధులు, మన నీళ్లు, మన నియామకాలు, మన వనరులు, మానవ వనరుల కోసం ఉద్యమం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఆనాడు ఉద్యమంలో పాల్గొన్న ప్రగతిశీల భావాలు కల్గినవాళ్ళంతా ఈ సమయంలో ముందుకు వచ్చి నియంత పాలనపై పోరాడాలని భట్టి విక్రమార్క పిలునిచ్చారు.
పీపుల్స్ గవర్నమెంట్ ఏర్పాటు చేద్దాం;
నియంత పాలనకు ముగింపు పలికి పీపుల్స్ గవర్నమెంట్ ఏర్పాటు చేసేందుకు ప్రతిఒక్కరు ముందుకు రావాలని భట్టి కోరారు. కలిసి పనిచేసేందుకు గద్దర్, విమలక్క, సుధాకర్ తదితరులను కాంగ్రెస్ ఆహ్వానిస్తోంది విక్రమార్క చెప్పారు.
మహా కూటమి ఏర్పాటు చేద్దాం
నియంతలా పాలన చేస్తున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని దించేందుకు అన్ని పార్టీలు కలిసి ముందుకు రావాలని అన్నారు. టీజేఎస్ సహా అందరూ మహా కూటమిగా ఏర్పడి దొర పాలనకు ముగింపు పలకాలని అన్నారు. మహా కూటమి కాంగ్రెస్ నాయకత్వంలో ఉంటుంది. కేసీఆర్ విచ్చలవిడిగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించారని విక్రమార్క విమర్శించారు.ఎన్ని ఇబ్బందులున్నా సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారని.. చెప్పారు. ఉమ్మడి ఆలోచనలతో ముందుకు నడుద్దాం,ప్రజాస్వామ్యాన్ని నిర్మించాలని భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు.source:shd w.app. g.