శ్రీశైల మల్లికార్జునస్వామి పరమ భక్తులలో ఒకరైన మల్లమ్మ జయంత్యోత్సవం వైశాఖ పౌర్ణమిని పురస్కరించుకుని (07.05.2020) ఉదయం నిర్వహించబడుతోంది. దేవస్థానం గోశాల సమీపంలో గల హేమారెడ్డి మల్లమ్మ మందిరంలో విశేష పూజలు నిర్వహిస్తారు.
ప్రస్తుతం కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా ప్రధాన ఆలయముతో పాటు పరివార దేవాలయాలలో దర్శనాలు పూర్తిగా నిలుపుదల , అదేవిధంగా ప్రస్తుతం లాక్ డౌన్, 144 సెక్షన్ అమలులో ఉన్నందున భక్తులను ఈ ఉత్సవానికి అనుమతించే అవకాశం ఉండదు. పరిమిత సంఖ్యలో అర్చకస్వాములు మాత్రమే ఏకాంతంగా ఈ జయంత్యోత్సవ సంబంధి పూజలను జరిపిస్తారు.