మయూర వాహనం పై మల్లన్న దంపతుల మధుర విహారం

శ్రీశైల దేవస్థానం: మహాశివరాత్రి  బ్రహ్మోత్సవాలలో భాగంగా  నాలుగో రోజు  (07.03.2021) న  స్వామిఅమ్మవార్లకు విశేషపూజలు నిర్వహించారు.
• లోక కల్యాణం కోసం రుద్రహోమం, చండీహోమం, జపాలు, పారాయణలు జరిగాయి.
•  ఉదయం  శ్రీవరసిద్ధివినాయకస్వామివారి దేవస్థానం నుండి శ్రీ స్వామిఅమ్మవార్లకు పట్టువస్త్రాల సమర్పణ కార్యక్రమం జరిగింది.
•  సాయంత్రం  తిరుమల తిరుపతి దేవస్థానం నుండి శ్రీ స్వామిఅమ్మవార్లకు పట్టువస్త్రాల సమర్పణ కార్యక్రమం జరిగింది.
• సాయంకాలం మయూరవాహనసేవ,  శ్రీస్వామిఅమ్మవార్ల గ్రామోత్సవం ఘనంగా నిర్వహించారు. గ్రామోత్సవంలో పలు సంప్రదాయ జానపద కళారూపాల ప్రదర్శన ఆకర్షణగా నిలిచింది.
• ఆలయ దక్షిణమాడవీధిలోని నిత్యకళారాధన వేదిక, పుష్కరిణి వేదిక , శివదీక్షా శిబిరాల వేదిక వద్ద సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ ఆహ్లాదంగా జరిపారు.

print

Post Comment

You May Have Missed