శ్రీశైల ఉగాది మహోత్సవాలు ఈ రోజు తో మనోహరంగా ముగిసాయి. ఆదివారం శ్రీ స్వామి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు.యాగశాలలో శ్రీ చండీశ్వరస్వామి కి ప్రత్యేక పూజలు జరిపారు.లోకకల్యాణం కోసం జపాలు జరిపారు.రుద్రహోమం , జయాది హోమం నిర్వహించారు. రుద్ర హోమ యాగ పూర్ణాహుతి ,వసంతోత్సవం ,అవబృధం కార్యక్రమాలు జరిపారు. వసంతాన్ని అర్చకులు,వేద పండితులు భక్తులపై సమంత్రకంగా ప్రోక్షించారు. ఈ ఓ శ్రీరామచంద్ర మూర్తి , బోర్డ్ సభ్యులు గిరీష్ ఎం .పాటిల్ తదితరులు పాల్గొన్నారు.ఈ రోజు అశ్వవాహన సేవ ఘనంగా జరిపారు. ఉగాది మహోత్సవాలు అందరి సహకారంతో ఘనంగా ముగిసాయని ఎడిటర్ డా.అనిల్ తెలిపారు.మొత్తం ఉత్సవాలను ఈ ఓ బాగా పర్యవేక్షించి విజయవంతం చేసారు. దేవస్థానం అధికారులు , సిబ్బంది చక్కగా సహకరించారు.