మచిలీపట్నం కు పోర్టు పనులు ప్రారంభించాలని మంత్రి కొల్లు రవీంద్ర ,ఎంపీ కొనకళ్ల నారాయణ కోరారు . కృష్ణా జిల్లా మచిలీపట్నం శ్రీ కళ్యాణ వేదిక లో ఆదివారం జరిగిన తెలుగు దేశం మినీ మహానాడు కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర ,ఎంపీ కొనకళ్ల నారాయణ, మున్సిపల్ చైర్మన్ బాబా ప్రసాద్, మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్, పలువురు తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు.