×

బ్రాహ్మణ పరిషత్ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి -లక్ష్మీకాంతరావు పిలుపు

బ్రాహ్మణ పరిషత్ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి -లక్ష్మీకాంతరావు పిలుపు

Vipravanam:  కార్తీక సమారాధన ,  వన భోజన కార్యక్రమం
ఆదివారము  శ్రీ రుద్రేశ్వర స్వామీ దేవాలయ (వేయి స్తంభాల దేవాలయ) ప్రాంగణంలో  జరిగింది .  ముఖ్యఅతిథులుగా   రాజ్యసభ సభ్యులు  వొడితల లక్ష్మికాంతరావు – శ్రీ సరోజినీ దేవి దంపతులు దీప ప్రజ్వలన, ధాత్రీ నారాయణ పూజ (ధాత్రీ నారాయణుల కళ్యాణ మహోత్సవం) నిర్వహించారు . కార్యక్రమ వేదిక నిర్వహణ  గుడిమెల్ల విజయకుమారాచార్యులు, గంగు మణికంట శర్మ  నిర్వహించారు. హన్మకొండ, ఖాజీపేట్, వరంగల్ , జిల్లా లోని అనేక ప్రాంతాల నుంచి వచ్చిన బ్రాహ్మణ బంధువులందరి కీ ఘనంగా స్వాగతం పలికారు. మహిళలకు చీర, రవిక తాంబూలాలను, పురుషులకు కండువాలతో హుజురాబాద్ MPP  వొడితల సరోజినీ దేవి  సత్కరించారు.  వొడితల లక్ష్మికాంతరావు మాట్లాడుతూ బ్రాహ్మణ పరిషత్ అందించే  పథకాలను అర్హులైన ప్రతి బ్రాహ్మణ కుటుంబం వినియోగించుకోవాలని కోరారు, హెల్ప్ సెంటర్ నిర్వహణను ప్రశంసించారు. వొడితల సరోజినీ దేవి  మాట్లాడుతూ కార్తీక మాసం ఎంతో ప్రాముఖ్యమైనదని, ఇలాంటి ఈ మాసంలో తమ చేతుల మీదుగా ధాత్రీ నారాయణుల కళ్యాణ మహోత్సవం జరుగడం మా పూర్వజన్మ సుకృతమని తెలిపారు.  కార్యక్రమంలో పాల్గొన్న బ్రాహ్మణులకు భోజన కార్యక్రమం నిర్వహించారు.  రాష్ట్ర గౌరవ అధ్యక్షులు గంగు ఉపేంద్ర శర్మ , రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఐనవోలు వెంకట సత్యమోహన్ , ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి  శ్రీనివాసాచారి, వరంగల్ అర్భన్  జిల్లా అధ్యక్షులు వల్లూరి పవన్ కుమార్ , డాక్టర్స్ కన్వీనర్ డా. నమిలికొండ పాంచాల్ రాయ్ , నాగరాజు రవీందర్ రావు , విన్నకోట రాజ్ కుమార్ , చకిలం సుధాకర్ రావు, పురుషోత్తం , అప్పే రవిశంకర్ శర్మ , గణపతి శర్మ , ప్రభాకర్ రావు , బాబాగి , వివిధ డివిజన్ అధ్యక్షులు,  కార్యదర్శులు, మహిళా వింగ్ నుంచి ఉషశ్రీ , గాయత్రీ , జ్యోతి , శశికళ , జయశ్రీ ,  భద్రకాళి మహిళా సంఘం సభ్యులు, కళ్యాణమస్తు కార్యవర్గసభ్యులు ,  బ్రాహ్మణ సంఘ పెద్దలు, సభ్యులు పాల్గొన్నారు.కార్యక్రమం విజయవంతం చేసిన అందరికీ  తెలంగాణా బ్రాహ్మణ సేవా సమితి వరంగల్ అర్భన్ జిల్లా శాఖ  ధన్యవాదాలు తెలిపింది .

print

Post Comment

You May Have Missed