బ్రాంచ్ ప్రూనింగ్, ష్రెడ్డింగ్ మిషన్లను ప్రారంభించిన మేయర్
హైదరాబాద్ ఆగష్టు 22(ఎక్స్ ప్రెస్ న్యూస్);జీహెచ్ఎంసీ అర్బన్ బయోడైవర్సిటీ విభాగం ఆధునిక వాహనాలైన బ్రాంచ్ ప్రూనింగ్ మిషన్, ష్రెడ్డింగ్ మిషన్లు సమకూర్చుకున్నాయి. 15లక్షల రూపాయల వ్యయంతో కొనుగోలు చేసిన బ్రాంచ్ ప్రూనింగ్ మిషన్ ద్వారా భారీ వానలు, ఈదురుగాలుల వల్ల రహదారులపై కొమ్మలు విరిగిపడటం, రోడ్లకు అడ్డంగా ఉన్న చెట్ల కొమ్మలను అత్యంత సులువుగా కేవలం ఒకే వ్యక్తితో అత్యంత వేగంగా తొలగించేందుకు సులభతరం అవుతుంది. రెండున్నర లక్షల రూపాయల వ్యయంతో కొనుగోలు చేసిన ష్రెడ్డింగ్ మిషన్ ద్వారా నరికిన కొమ్మలను చిన్న చిన్న ముక్కలుగా చేయడం ద్వారా వాటి రవాణాకి సులభం కావడంతో పాటు సేంద్రీయ ఎరువుల తయారీకి అనువు అవుతుంది. ఈ రెండు యంత్రాలను నగర మేయర్ బొంతు రామ్మోహన్ నేడు స్థానిక శాసన సభ్యులు డా.లక్ష్మణ్, డిప్యూటి మేయర్ బాబా ఫసియుద్దీన్లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ రామ్మోహన్ మాట్లాడుతూ ప్రకృతి విపత్తుల సమయంలో రహదారుల పై కూలిన చెట్లను వెంటనే తొలగించడంతో పాటు అతితక్కువ సమయంలో ఇబ్బందులను తీర్చేందుకు అవకాశం ఏర్పడుతుందని అన్నారు. ఇలాంటి యంత్రాలను ప్రతి జోన్కు ఒకటి చొప్పున కొనుగోలు చేయనున్నట్టు చెప్పారు. హైదరాబాద్ నగరంలో హరితహారంలో భాగంగా జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నేటి వరకు 50లక్షలకుపైగా మొక్కలు నాటడంతో పాటు పంపిణీ చేయడం జరిగిందని పేర్కొన్నారు. మొక్కలను నాటడమే కాకుండా వాటి పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నామని, దీనిలో భాగంగా పలు కంపెనీలు, వ్యాపార సంస్థల నుండి కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్బులిటీలో భాగంగా ట్రీగార్డ్లను సమకూర్చుతున్నామని తెలిపారు. ఇప్పటి వరకు 6,325 ట్రీగార్డ్లు వివిధ సంస్థలు ఉచితంగా అందజేశాయని, వీటిని వివిధ కాలనీలు, ప్రధాన రహదారుల వెంట నాటిన మొక్కల పరిరక్షణకు వినియోగిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అర్బన్ బయోడైవర్సిటీ డైరెక్టర్ దామో