శ్రీశైలం దేవస్థానం శివరాత్రి బ్రహ్మోత్సవాలు శుక్రవారం బ్రహ్మానందంగా ముగిసాయి . ఫిబ్రవరి 6 వ తేదీన ఈ బ్రహ్మోత్సవాలు ప్రారంభమైయ్యాయి . ముగింపు ఉత్సవాల్లో ప్రధానంగా ఉదయం శ్రీ స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు .
*అశ్వవాహన సేవ
శుక్రవారం సాయంత్రం అశ్వవాహన సేవ ఘనంగా జరిగింది . శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను అశ్వవాహనంపై వేంచేపు చేయించి విశేష పూజలు జరిపారు . అనంతరం ఆలయ ప్రాంగణంలో ప్రాకారోత్సవం జరిపారు .
*సాంప్రదాయపరంగా పుష్పోత్సవం , శయనోత్సవం :
సాంప్రదాయపరంగా ఈ రోజు సాయంత్రం శ్రీస్వామి అమ్మవార్లకు పుష్పోత్సవం జరిపారు . శ్రీ స్వామి అమ్మవార్లకు ఎర్రబంతి , పసుపు బంతి , పసుపు చేమంతి , నందివర్ధనం, గరుడవర్థనం, మందారం ,ఎర్ర ఆస్టర్, నీలం ఆస్టర్,కాగడాలు మొదలైన పుష్పాలతో విశేషంగా అర్చన చేసారు . అనంతరం శ్రీ స్వామి అమ్మవార్లకు ఏకాంత సేవను నిర్వహించి శయనోత్సవం జరిపారు .
*దేవస్థానం విజయం :
బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించడంలో దేవస్థానం మొదటి నుంచి చక్కని ఏర్పాట్లు చేసింది . అన్ని స్థాయిల్లో సమన్వయంతో పనిచేసి బ్రహ్మోత్సవాలను ఘనంగా ముగించారు .