బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డా.కె.లక్ష్మన్ హైదరాబాద్ లో విస్తృతంగా పర్యటించారు. నగరవ్యాప్తంగా అనేక కాలనీలను సందర్శించి ప్రభావిత ప్రాంతాల ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకున్నారు. సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించారు. బాధితులకు పాలు, దుప్పట్లు పంచారు. ప్రమాదకరంగా మారిన పలు సరస్సులను సందర్శించి వరద ముంపును తెలుసుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్.రామచందర్ రావు, ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, ఎన్.వి.ఎస్.ఎస్. ప్రభాకర్ తో కలిసి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్య నాయుడుతో సమావేశమయ్యారు. భారీ వర్షాలతో హైదరాబాద్ లో నెలకొన్న పరిస్థితిని వివరించి కేంద్ర ప్రభుత్వం నుంచి తగిన సహాయాన్ని అర్థించారు. లక్ష్మన్ వినతికి వెంకయ్య నాయుడు సానుకూలంగా స్పందించారు. గాంధీ నగర్ లోని అరుంధతి నగర్, శేరిలింగంపల్లిలోని ధరణి కాలనీ, కూకట్ పల్లిలోని దీన్ దయాళ్ నగర్ తో పాటు పలు కాలనీలను సందర్శించారు. లక్ష్మన్ తో పాటు బిజెపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు నగరవ్యాప్తంగా పర్యటిస్తూ సహాయ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ప్రజల అవస్థలపై బిజెపి స్పందనపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
భారీ వర్షాలకు భాగ్యనగరం అతలాకుతలమైన నేపథ్యంలో కూకట్ పల్లి దీన్ దయాళ్ నగర్ లోని ప్రభావిత ప్రాంతాలను బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డా.కె.లక్ష్మన్ సందర్శించారు. బాధితులకు పాల ప్యాకెట్లు పంపిణీ చేశారు. సహాయ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని అధికారులను ఆదేశించారు.