*మౌళి,మచిలీపట్నం*
బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన బిసి,మైనారిటీ చైతన్య సదస్సును జయప్రదం చేయాలని బిఎస్పీ మచిలీపట్నం నియోజకవర్గ అధ్యక్షుడు కుంపటి జయాకర్ బాబు కోరారు.
బిఎస్పీ ఆధ్వర్యంలో స్థానిక బెల్ ఆడిటోరియంలో బుధవారం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ బి.సి.లు,క్రిస్టియన్-ముస్లిం మైనారిటీలు ఎదుర్కొంటున్న సమస్యలు, రిజర్వేషన్లు తదితర విషయాలపై బిఎస్పీ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల 28వ తేదీన జిల్లాకేంద్రమైన మచిలీపట్నం లో జిల్లాసదస్సు నిర్వహించనున్నట్లు వివరించారు.
పార్టీ ప్రధాన కార్యదర్శి గడ్డంరాజు మాట్లాడుతూ ఈసదస్సుకు ముఖ్య అతిధిగా బిఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ,రిటైర్డ్ ఐ.జి పట్టపు రవి,రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుష్పరాజ్,కార్యదర్శి లంకా కరుణాకర్ దాస్,జిల్లా పార్టీ అధ్యక్షుడు కొడమల ప్రభుదాస్,జిల్లాలో ని అన్ని నియోజకవర్గాల నాయకులు పాల్గొంటారని తెలిపారు.
బిఎస్పీ బిసి సెల్ ప్రెసిడెంట్ వేముల పాపారావు,గుంటూరు సురేష్ తదితరులు పాల్గొన్నారు.