బంగారు తెలంగాణ కు గజ్వేల్ నుంచే బాటలు-కేసీఆర్ భరోసా

బంగారు తెలంగాణ కు గజ్వేల్ నుంచే బాటలు వేస్తున్నామని కేసీఆర్  అన్నారు .ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో ఆదివారం టీఆర్ఎస్   అధినేత , ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు . ఈ   సమావేశానికి మంత్రి హరీశ్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ,మండలి చీఫ్ విప్ పాతూరి సుధాకర్ రెడ్డి, గజ్వేల్ నియోజకవర్గంలోని 8 మండలాల నుంచి దాదాపు 20 వేల మంది నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు .

★ కేసీఆర్ వ్యాఖ్యలు ఇవి :

* ఎమ్మెల్యేలుగా ఉన్న వారు ప్రజల్లోనే ఉంటూ గడుపుతారు .
* సిద్దిపేట ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు  నేనూ ఆ పని చేసేవాడిని.
* ఇప్పుడు పాత్ర మారింది… రాష్ట్రంలోని 31 జిల్లాలను చూసుకునే పరిస్థితి.
* గజ్వేల్  గతంలో  కంటే మెరుగైంది. ఇక్కడితో ఆగి పోవద్దు.
* భూగోళంపై మానవజాతి ఉన్నంత కాలం సమస్యలు ఉంటాయి.. అమెరికా లోనూ సమస్యలు ఉంటాయి.
*  నియోజకవర్గంలో 18 ఏండ్లు నిండిన ఏ వ్యక్తి ఇల్లు లేకుండా ఉండకూడదు.
* డివిజన్ కేంద్రం, ఆర్డీఓ, డిఎస్పీ కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్నాం.
* అన్ని రహదారులు తారు రోడ్లు, డబుల్ రోడ్లు కావాలి.
* గజ్వేల్ కు రైలు రావాలి. అది కరీంనగర్ కు వెళ్ళి అక్కడి నుంచి రైట్ కు పోతే ఢిల్లీకి, లెఫ్ట్ పోతే ముంబయికి . ఈ లైన్ ఈ ప్రాంతానికి ముఖ్యంగా మారుతుంది.
* ప్రతి ఎకరాకు సాగునీరు, ప్రతి ఇంటికి తాగు నీరు రావాలి.
* వచ్చే వర్షా కాలం నాటికి అన్ని చెరువులు, కుంటలు నింపుకుంటాం.
* గజ్వేల్ సాగునీటి అవసరాలు తీర్చే ప్రధాన రిజర్వాయర్ కొండపోచమ్మ సాగర్.
* గజ్వేల్ నియోజక వర్గానికి లక్ష 80 వేల ఎకరాలకు సాగు నీరు అందబోతోంది .
* పండిన పంట మేలైన ధరకు, అన్ డిమాండ్ అమ్ముడు పోవాలి.
* కల్తీ వస్తువులతో అనేక రోగాలు వస్తున్నయి.
* ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ రావాల్సి ఉంది.. గజ్వేల్ లో ఫస్ట్ ఫేసులోనే వస్తాయి.
* పంట కాలనీలు మొదట గజ్వేల్ లోనే ఏర్పాటై తెలంగాణకు ఆదర్శం కావాలి.
* వచ్చే రెండేళ్లలో ఇల్లు లేని కుటుంబం గజ్వేల్లో ఉండ కూడదు.
* మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్లు కూడా వస్తే పాడి, పంట బాగుపడుతది.
* ప్రతి ఇంటికి 70 శాతం సబ్సిడిపై అందిస్తాం.
* నేను ప్రజల్లోకి వెళ్లి డబ్బా కొట్టుకోలే..
* ప్రజల బాగు కోసం పథకాల రూపకల్పన జరగాలి… ఈ ఎర్రవల్లిలోనే 70 శాతం పథకాలను ఆలోచించి అమలు చేసాం.
* కంటి వెలుగు పథకాన్ని అమెరికాలో చూసి అమలు చెయలేదు.. ఈ వ్యవసాయ క్షేత్రంలో ఆలోచించే అమలు చేశాను.
* ఇంత పకడ్బందీగా కంటి వెలుగు అమలు అవుతుందంటే రెండు నెలలు కష్టపడ్డా.
* పాత ప్రభుత్వ సంప్రదాయాలు, ఇనుపగోడలు బద్దలు కొట్టి అమలు చేస్తున్న పథకమే రైతు బంధు.
* గతంలో ముఖ్యమంత్రులుగా పని చేసిన వారికి వ్యవసాయం తెలియదా ? వారెందుకు ఆలోచించ లేదు.
* గజ్వేల్ నియోజకవర్గంలో గ్రామా ప్రణాళికలు వేసి, మళ్ళీ నాలుగేళ్ల నాటికి రూపురేఖలు మార్చాలి.
* పేదరికానికి కులం లేదు… అది అందరిని దహించి వేస్తోంది.
* అన్ని కులాల్లో పేదరికం ఉన్నది.. దళిత వర్గాల్లో, బీసీ వర్గాల్లో ఎక్కువగా, మిగితా కులాల్లో కాస్త తక్ఖవగా ఉంది.
* వెయ్యి ఏండ్లు ఎవరూ బతకరు .ఉన్నసమయం లోనే ఉన్నత లక్ష్యాల కోసం పని చేయాలి.
* రాష్ట్రం కోసం పని చేయడంలో ఎక్కువ సమయం కేటాయించిన… వచ్చే టర్మ్ లో గజ్వేల్కు కూడా కొంత సమయం కేటాయిస్తానని ప్రామిస్ చేస్తున్న.
* దేశంలో తెలంగాణ ధనిక రాష్ట్రం.. 17.17 వృద్ధి రేటుతో ముందుకు పోతున్నము. దేశంలో చాలా రాష్ట్రాలు ఇందులో సగం కూడా లేదు.
* ఇది వట్టిగా రాలేదు.. కడుపు కట్టుకోవాలి.. అవినీతిని రూపుమాపాలి అహర్నిశలు శ్రమించాలి.
* విమర్శించే వాళ్ళను ప్రశ్నించండి.
* మంచినీటి పథకం అంటే గతంలో ఆడో బోరు.. ఇడొ బోరు అంటే.. ఇప్పుడు మిషన్ భగీరథ తో ఇంటింటికీ నల్లా నీరు వస్తుంది.. ఈ నీళ్లు 200 కిలోమీటర్ల దూరం నుంచి గోదావరి నీళ్ళు ఇస్తున్నాం.
* రాష్ట్రంలో 20 వేల గ్రామాల్లో పూర్తయింది.. మరోబ్15 రోజుల్లో 3 వేల గ్రామాల్లో పూర్తి కానుంది.
* మన నెక్స్ట్ టార్గెట్ పేదరిక నిర్మూలన.
* అన్ని వర్గాల్లోనూ పేదరికాన్ని పారద్రోలాలి.
* రేపు గజ్వెల్ను చూడటానికి దేశం నుంచి ఎందరో వస్తారు
* గజ్వేల్ నియోజకవర్గం స్వావలంబన సాధించిన నియోజకవర్గంగా మారాలి.
* అలా మారాలంటే కమిటిమెంట్, కన్విక్షన్ ఉండాలి.
* ఎన్నికల తరువాత
* ఇంకో 70 వేల కోట్లను ఖర్చు చేస్తే కోటి ఎకరాల తెలంగాణ అయితది.
* ఇది పూర్తయితే 10 లక్షల కోట్ల ఆదాయం సమకూరుతుంది.
* రాష్ట్ర వ్యాప్తంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజి సిస్టమ్ అమలు చేస్తాం.. ఆ పైలెట్ ప్రాజెక్టును గజ్వేల్ నుంచే మొదలు పెడతాం.
* మహిళల కోసం కూడా నా మనసులో మంచి ఆలోచన ఉన్నది.
* లిజ్జత్ పాపాడ్ ముంబాయి లోని ఓ మురికి కాలనిలో ఓ మహిళ సంఘం ప్రారంభించింది.. ఇప్పుడు దాని టర్నోవర్ వెయ్యి కోట్లు..
* ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లలో మహిళలకే ప్రాధాన్యత ఉంటుంది.
* ఎన్నికల నిబంధనలు మనమంతా పాటించాలి.
* అన్ని నియోజకవర్గాల్లో ఒక అబ్జర్వర్ ఉంటే సీఎం నియోజకవర్గానికి ఇద్దరు ఉంటారు.
* 14న నామినేషన్ వేస్తున్నా.. ఎవరూ రావద్దు.. 10 మందితో కలిసి వెళ్లి వేస్తాను.
* చివర్లో భారీ ఎత్తున పబ్లిక్ మీటింగ్ పెట్టుకుందాం.
*  గెలుపు నకు ఢోకా లేదు
* ఈ సారి కేంద్ర రాజకీయాల్లో కూడా కీలకపాత్ర పోషించబోతున్నాం.
* దుర్మార్గుల విమర్శలకు సమాధానంగా ఎన్నికలకు పోతే ఈ రోజు గోళ్లు గిల్లుకుంటూ విపక్షాలు కూచున్నాయి.
* ఈ నెల 15 నుంచి నుంచి నా టూర్ లు ఉంటాయి.
* గజ్వేల్ కథానాయకులు మీరే

★ మంత్రి హరీశ్ రావు కామెంట్స్..

* ఇక్కడికి 20 వేల మంది కార్యకర్తలు వచ్చారు. ఒక్కక్కరూ 10 మంది చేత ఓటేపిస్తే 2 లక్షలు దాటుతుంది.
* అభివృద్ధిలో గజ్వేల్ 20 ఏండ్లు ముందుకు పోయిందని అంటున్నారు.. కాని కేసీఆర్ చారాణే మాత్రమేనంటున్నారు. ఇపుడే 20 ఏండ్లు ముందుంటే, మిగితా భారాణ పూర్తి చేస్తే 70 ఏండ్ల ముందుకు పోతుంది. దేశానికే ఆదర్శంగా గజ్వేల్ నిలుస్తుంది .
* గులాబీ సైనికులు E.C. నిబంధనలు తూ. చ. తప్పకుండా పాటీంచాలి.
* ఏ గ్రామ కార్యకర్తలు ఆ గ్రామంలోనే ఉండి ప్రచారం చేయాలి.
* ఏది చేసినా E.C. అనుమతి తీసుకోవాలి.
* 95 శాతం ప్రజలు TRS వైపే ఉన్నారు.

★ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కామెంట్స్..

* అభివృద్ధిని అడ్డుకుంటున్న గుంట నక్కల నుంచి గజ్వేల్ ను కాపాడుకోవాలి.
* ముఖ్యమంత్రి పై పోటీ చేశామన్న సంతృప్తి తప్ప ప్రత్యర్గులకు మిగిలేదేమి లేదు.
* కూటమి అభ్యర్థి ప్రతాప్ రెడ్డికి డిపాజిట్ దక్కే పరిస్థితి లేదు.
* బంగారు తెలంగాణ కు గజ్వేల్ నుంచే బాటలు పడుతున్నాయి.

print

Post Comment

You May Have Missed