చిత్తూరు: నవరత్నాలతో జీవితాలు బాగుపడుతాయని, ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు కనిపిస్తుందని, ప్రతి రైతన్న ముఖంలో ఆనందం కనిపిస్తుందని తాను గట్టిగా నమ్ముతున్నట్లు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. కచ్చితంగా నవరత్నాలు తీసుకువస్తానని, మీ అందరికి మంచి చేస్తానని ఆయన మాటిచ్చారు. చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చే రూ.3 వేల డబ్బుకు మోసపోవద్దని..20 రోజులు ఓపిక పడితే అన్న ముఖ్యమంత్రి అవుతారని ప్రతి ఒక్కరికి చెప్పాలని వైయస్ జగన్ పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చిత్తూరు జిల్లా మదనపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైయస్ జగన్ ప్రసంగించారు. ఆయన ఏమన్నారంటే..
మదనపల్లి మీదుగా నా 3648 కిలోమీటర్ల పాదయాత్ర సుదీర్ఘంగా సాగింది. ఆ రోజు నాకు బాగా గుర్తుంది. ఇదే మదనపల్లి నియోజకవర్గంలో దేశంలోకెల్లా రెండో అతిపెద్ద మార్కెట్ ఇక్కడ ఉంది. టమాటల మార్కెట్ ఇక్కడ ఉంది. మదనపల్లిలో గిట్టుబాటు ధర లేక టమాట రైతులు రోడ్డుపై పారవేసిన దుస్థితి చూశాను. కష్టాలు పడుతున్న రైతుల ఆవేదనను చూశాను. కిలో రూపాయికి టమాటలు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉందని రైతన్నలు నాతో అన్నారు. ప్రభుత్వం గిట్టుబాటు ధరలు కల్పించి ఆదుకోవాల్సి ఉండగా మార్కెట్ పేరుతో పది శాతం వసూలు చేస్తున్నారని రైతులు చెప్పిన మాటలు గుర్తున్నాయి. చంద్రబాబు కంపెనీ హెరిటేజ్ కోసం దళారీలకు నాయకుడయ్యారు. ఇదే నియోజకవర్గంలోనే పాలబాటిల్ తీసుకొని వచ్చి అన్నా..ఒక్క లీటర్ మినరల్ వాటర్ ధర..లీటర్ పాలకు ఇస్తున్నారని చెప్పారు. హెరిటేజ్ లాభం కోసం ఏ రకంగా చిత్తూరు డయిరీని సమాధి చేశారో ఇక్కడి రైతులు చెప్పిన సంగతి మరిచిపోలేదు. ఇదే ప్రాంతంలో చేనేతల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించాం. చేనేతలకు గుర్తింపుకార్డులు లేవు. ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసింది చెప్పారు.
– వైయస్ఆర్సీపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా నావాజ్ నిలబడ్డారు. ఎంపీ అభ్యర్థిగా మిథున్‌రెడ్డి నిలబడ్డారు. ఈ ఇద్దరికి మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు ఇవ్వాలని పేరు పేరున కోరుతున్నాను. మన పార్టీ గుర్తు ఫ్యాన్..అక్కా మన గుర్తు ఫ్యాన్..అవ్వా ఫ్యాన్..ఫ్యాన్ అన్నా..ఫ్యాన్ అక్కా..ఫ్యాన్ అవ్వా..ఫ్యాన్ అన్నా..ఫ్యాన్ అమ్మా..మన గుర్తు ఫ్యాన్..అక్కా ఫ్యాన్..తల్లి ఫ్యాన్ గుర్తు మనది..మరిచిపోవద్దు.
అనంతపురం: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక హోదాకు మద్దతిస్తుంటే చంద్రబాబు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ మద్దతు ఇస్తున్నది హోదాకా? వైయస్ఆర్సీపీకా అని చంద్రబాబును ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైయస్ జగన్ ప్రసంగించారు.
కర్నూలు: అన్ని వర్గాల ప్రజలు, ప్రభుత్వ, ఔట్సోర్సింగ్ విభాగాల్లో పని చేసే ఉద్యోగులకు వైయస్ జగన్ వరాల జల్లులు కురిపించారు. చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దని, 20 రోజులు ఓపిక పడితే అన్న ముఖ్యమంత్రి అవుతారని ప్రతి ఒక్కరికి చెప్పాలని వైయస్ జగన్ పిలుపునిచ్చారు. ఉద్యోగులకు 27 శాతం ఐఆర్, సకాలంలో పీఆర్సీ ప్రకటిస్తానని, సీపీఎస్ రద్దు చేస్తానని మాట ఇచ్చారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఏర్పాటు చేసిన సభలో వైయస్ జగన్ ప్రసంగించారు.