ఫోటోగ్రాఫర్ సోదరా…..అభినందనలు-శ్రీశైల దేవస్థానం ఈ ఓ
ఫోటోగ్రాఫర్ల దినోత్సవం సందర్బంగా
మిత్రులకు శుభాకాంక్షలు..
కదులుతున్న కాలాన్ని
కాలగమనంలో కలిసిపోయే దృశ్యాన్ని
అనుక్షణం గమనిస్తూ…
తన “క్లిక్” ద్వారా బంధిస్తూ…
అందరికి ఆనందాన్ని పంచుతూ…
ఏ ఒక్కడి బాధనో ప్రపంచానికి చూపిస్తూ…
తాను కనబడకుండా…
తన బాధలు ప్రపంచానికి తెలియకుండా…
కష్టాలు కన్నీళ్లు దిగమింగుతూ…
రంగుల ప్రపంచాన్ని ఇంకా అందంగా ఆహ్లాదంగా చూపించే
ఫోటోగ్రాఫర్ సోదరా…..అభినందనలు…
శుభాన్ని అశుభాన్ని నిర్లిప్తంగా ఆస్వాదించే యోగి నీవు.
ఆనందాన్ని పంచే సుమధుర చిత్రాలు
నీ హస్తలాఘవమే కదా
ఎండుటాకును పండుముసలిని పచ్చని పొలాలను
రైతన్నల స్వేదాన్ని….కార్మికుడి కష్టాన్ని
శ్రామికుడి నష్టాన్ని….లోకానికందించే దృష్టవు నీవు
ఆధునిక స్రష్టవు నీవు….
నీకు వందనం
అభినందన చందనం…..
మీ సోదరుడు…..రామ రావు
——————————-
కార్యనిర్వహణాధికారి,
శ్రీశైల దేవస్థానం,
శ్రీశైలం.
శ్రీ సాక్షిగణపతి స్వామికి విశేష అభిషేకం
శ్రీశైల దేవస్థానం:లోక కల్యాణం కోసం దేవస్థానం ఈ రోజు ఉదయం సాక్షిగణపతిస్వామి వారికి విశేష అభిషేకాన్ని నిర్వహించింది.
ప్రతి బుధవారం, సంకటహరచవితి రోజులు, పౌర్ణమిరోజులలో శ్రీసాక్షిగణపతి వారికి ఈ విశేష అభిషేకం, పూజాదికాలు దేవస్థానంసేవగా (సర్కారిసేవగా) నిర్వహిస్తారు.
ఈ ఉదయం సాక్షిగణపతిస్వామివారికి పంచామృతాలతోనూ, పలు ఫలోదకాలతోనూ, హరిద్రోదకం, గంధోదకం, పుష్పోదకం, కలశోదకం, శుద్ధజలంతో అభిషేకం నిర్వహించారు. తరువాత స్వామివారికి విశేష పుష్పార్చన, నివేదన కార్యక్రమాలు జరిగాయి .
వీరభద్రస్వామికి విశేష పూజలు:
లోకకల్యాణం కోసం దేవస్థానం ఈ రోజు సాయంకాలం ఆలయ ప్రాంగణంలోని వీరభద్రస్వామివారికి (జ్వాలావీరభద్రస్వామివారికి) విశేషపూజలను నిర్వహించారు.
ఆలయప్రాంగణంలో మల్లికార్జునస్వామివారి ఆలయానికి ఉత్తరభాగంలో మల్లికా గుండానికి ప్రక్కనే ఉన్న వీరభద్రస్వామి జ్వాలామకుటంతో పదిచేతులతో విశిష్ట రూపంలో దర్శనమిస్తాడు. శిల్పశాస్త్ర పరిభాషలో ఈ స్వామికి అఘోరవీరభద్రమూర్తి అని పేరు కూడా ఉంది. స్వామివారికి ప్రక్కనే దక్షప్రజాపతి కనిపిస్తాడు. ఈ స్వామిని పరివార ఆలయాలలో భాగంగా ప్రతినిత్యం పూ జిస్తారు. ప్రతి బుధవారం ప్రదోషకాలంలో విశేష అభిషేకం కార్యక్రమం దేవస్థానం నిర్వహిస్తోంది.
ఈ పూజవలన లోకశాంతి, దుర్భిక్షనివారణ, భక్తుల అనుకున్న కోరికలు నెరవేరుతాయి. ముఖ్యంగా క్షేత్ర అభివృద్ధి జరుగుతుంది.
కాగా ఈ పూజలలో ముందుగా కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు మహాగణపతిపూజనుచేసారు.
తరువాత వీరభద్రస్వామికి పంచామృతాలతోనూ, పలురకాల ఫలోదకాలతోనూ, గంధోదకం, భస్మోదకం, పుష్పోదకం, బిల్వోదకం, హరిద్రోదకంతోనూ మరియు మల్లికా గుండంలోని శుద్ధజలంతో విశేష అభిషేకం జరిగింది.
ఈ అభిషేకాల తరువాత విశేషంగా స్వామివారికి పుష్పార్చనను చేసారు.అర్చకస్వాములు భౌతికదూరాన్ని పాటిస్తూ వీరభద్రస్వామివారికి విశేషార్చనలు చేసారు.
Post Comment