“ఫేక్‌ గ్యాంగ్‌ పోస్టులను అత్యుత్సాహంతో షేర్‌ చేసుకునే వాళ్లు సైతం సైబర్‌ క్రైమ్‌ చట్టం కిద్ద శిక్షార్హులే”

విజయవాడ : సోషల్‌ మీడియాలో ఫేక్‌ అకౌంట్లతో తనపై అసభ్య పదజాలంతో  దుష్ప్రచారం  సాగిస్తున్నారని  వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఏపీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు  ఆదివారం ఫిర్యాదు చేశారు. తన వ్యక్తిగత ప్రతిష్ట, గౌరవ, మర్యాదలకు భంగం కలిగించేలా తన పేరుతో కొందరు సోషల్‌ మీడియాలో ఫేక్‌ అకౌంట్లు సృష్టించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాంటి వారిపై  చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఫేక్‌గ్యాంగ్‌పై సైబర్‌ క్రైమ్‌ పోలీసులు విచారణ మొదలెట్టారని, సైబర్‌ క్రైమ్‌ చట్టం నుండి నిందితులు ఎవరూ కూడా తప్పించుకోలేరని అభిప్రాయపడ్డారు. ఫేక్‌ గ్యాంగ్‌ పోస్టులను అత్యుత్సాహంతో షేర్‌ చేసుకునే వాళ్లు సైతం సైబర్‌ క్రైమ్‌ చట్టం కిద్ద శిక్షార్హులేనని చెప్పారు. అలాంటి వారు ప్రపంచంలో ఎక్కడున్నా.. ఏ రాష్ట్రంలో ఉన్నా సైబర్‌ క్రైమ్‌ పోలీసుల వలకు చిక్కక తప్పదన్నారు.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.