ప్రేమోన్మాది ఘాతుకం

తాను ఇష్టపడ్డ యువతి  మరో  వ్యక్తితో నిశ్చితార్థం చేసుకుందన్న అక్కసుతో ప్రేమోన్మాది  చేసిన  ఘాతుకం ఇది . అంబర్‌పేట ఇన్స్‌పెక్టర్ ఏపీ ఆనంద్ కుమార్ అందించిన    వివరాలు ఇవి . గంగానగర్‌ నివాసి అయిన  యువతి  (17) చదువు మానేసి ఇంట్లోనే ఉంటోంది. గోల్నాక కు చెందిన  సోహైల్ (19) ప్రేమ పేరుతో ఆ యువతిని కొంతకాలంగా వేధింపులకు గురి చేస్తున్నాడు.  వేరే వ్యక్తితో ఆమెకు 15 రోజుల కింద నిశ్చితార్థం  చేశారు. విషయం తెలిసి అతను ఆమె ఇంటికి వెళ్లి నిలదీశాడు .  మాటామాటా పెరిగి  అక్కడే ఉన్న కిరోసిన్ తీసుకుని ఆమె ఒంటిపై పోసి నిప్పంటించాడు. ఆమె కేకలు విని   సమీపంలోని వారు  అక్కడకు చేరుకున్న్నారు . 108లో ఆమెను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. సోహైల్‌కు కూడా నిప్పంటుకోవడంతో   అతన్ని  గాంధీ ఆసుపత్రిలో కి తరలించారు . పోలీసులు  దర్యాప్తు చేస్తున్నారు .

print

Post Comment

You May Have Missed