ప్రభాత సమయాన ప్రకృతి భగవంతుని శక్తిమయం

ప్రభాత సమయంలో  ప్రకృతి భగవంతుని శక్తి  కలిగివుంటుందని బ్రహ్మశ్రీ  చాగంటి కోటేశ్వర రావు  వివరించారు. శ్రీశైలం ఆలయ దక్షిణ మాడ వీధిలో  ఏర్పాటు చేసిన  ప్రత్యేక వేదికపై  శనివారం చాగంటి వారు ” మల్లికార్జున సుప్రభాత వైభవం”  అంశం ఆధారంగా  గొప్ప ప్రవచనం అందించారు. ఈ నెల 25 వ తేదీ వరకు  ఈ ప్రవచనాలు కొనసాగుతాయి . అర్చక స్వాములు , వేదపండితులు  జ్యోతి ప్రజ్వలన  చేసిన అనంతరం దేవస్థానం  కార్యనిర్వహణ అధికారి  చాగంటి వారిని వేదికపైకి ఆహ్వానించారు. ప్రభాత సమయం  విశిష్టమైనదని  శాస్త్రాలు  పేర్కొన్నాయన్నారు .విద్యా దేవత సరస్వతీదేవి పేరుతో  ఈ సమయం బ్రాహ్మీ ముహూర్తంగా  ప్రసిద్ధమైనదని  బ్రహ్మశ్రీ  చాగంటి  చెప్పారు. ఈ సమయంలో  భగవంతుని  ఉపాసనను  ప్రారంభించండం మంచిదని  సనాతన ధర్మం చెబుతోందని ,  అందుకే ఈ  సమయంలో సుప్రభాతసేవ  చేయడం సంప్రదాయమైన్ధన్నారు . ఇందులో ఆయ క్షేత్రాల విశిష్టత , క్షేత్రాల దేవతల మహిమ  వర్ణింపబడి ఉంటుందన్నారు. శ్రీ శైల మల్లికార్జున సుప్రభాతం అద్భుత కూర్పు కూడి  ఉంటుందని  చాగంటి వారు చెప్పారు.  ఇందులో  శాబ్దిక సౌందర్యం , అర్థ సౌందర్యం , భావన సౌందర్యం  ఉంటుందని  వివరించారు. గణపతి  స్మరణ  వలన సకల విజయాలు కలుగుతాయని , శ్రీశైల సుప్రభాతం  గణపతి ధ్యానంతో ప్రారంభం అవుతుందని చెప్పారు. ఈ సుప్రభాతం చదవడం , శ్రవణం వలన సకల  శుభాలు కలుగుతాయని వివరించారు. ఉపద్రవాలన్నీ హరింపబడతాయన్నారు . శ్రీశైల క్షేత్ర మహిమ , రత్న గర్భ గణపతి , సాక్షి గణపతి విశేషాలు ప్రస్తావించారు. చాగంటి ప్రవచనాన్ని సభికులు ఆస్వాదించారు .

print

Post Comment

You May Have Missed