×

ప్రతీ అంగుళం భూమికి ఎవరు యజమానో తేల్చాలని ముఖ్యమంత్రి  ఆదేశం

ప్రతీ అంగుళం భూమికి ఎవరు యజమానో తేల్చాలని ముఖ్యమంత్రి  ఆదేశం

 Chief Minister K. Chandrashekar Rao has instructed the officials concerned to ensure that every urban and rural areas land is accounted for ownership of each and every inch of land is ascertained. The CM said through the Land Records Purification, Rectification and Updation, land records of rural areas in the state are clarified and in a similar way the details of land records in urban and cities should be finalised. Since it was decided to distribute passbooks on March 11, measures should be taken to reach the passbooks by March 5 in all the districts. The land records should be purified in such a manner that there would not be any litigation in future and they would be maintained with transparency.

The CM held a review meeting here on Thursday at Pragathi Bhavan on the simplified passbooks, preparation of Pahanis, programmes to be taken up post-Land records purification and on Dharani website maintenance. Chief Advisor to government  Rajiv Sharma, Principal Secretaries  S Narsing Rao, Ms Shanti Kumari, Principal Secretary (Revenue)  Rajeshwar Tiwari, Land Records Mission Director Ms Vakati Karuna, Mee Seva Commissioner Venkateswar Rao, Rangareddy District Collector  Raghunandan Rao, Medchel Collector  MV Reddy, MLA  Alam Venkateswarlu, MLC  Karne Prabhakar, MDC Chairman Seri Subhash Reddy and others participated.

“There are 31 columns in passbooks and Pahanis now. There is no need for so many columns due to several changes took place from time to time. There was a need of certain columns when the government was collecting the land Cess. Now there is no need. Some of these columns will add to the confusion. The entire data and information on land records will be on Dharani site. There is no need to have more information on the passbooks and Pahanis given to farmers. Important and necessary information will be sufficient. It is enough if the details of the name of farmer, survey number, extent of land and how he obtained the land are given. Terms are used in other languages in Pahanis and passbooks. Our farmers will never understand these terms. Use the terms and language, which our farmers can understand. The new passbooks and Pahanis should have these changes,” the CM said.

A decision is arrived at on what columns should be deleted and what new columns should be incorporated after a detailed discussion. It was decided to have these changes incorporated in passbooks and Pahanis, which are to be distributed. It was also decided to have the photograph of the landowner and a unique number to each passbook.

“The Land records Purification programmes became a great success. With this details and information of almost all the land, every inch in rural areas is ascertained. Decision regarding the lands in legal disputes, other disputes will be taken under the Part B land records rectification programme. Clarity arrived at in 93 percent of the lands. Land records in rural areas are almost cleaned. Now focus on the land in urban areas and in the cities. Find out which land owned by whom and fix the ownership rights. Examine if the private lands also can be given a unique number like the survey number. The government is of the view that after the land records purification there will be a fall in the land disputes in rural areas. Study what kind of method should be adopted for the urban and city areas? Details of every inch of land in Telangana under whose ownership it is and what is happening on the land etc., should be available with the government,” the CM told the officials.

The CM instructed,” On March 11, new passbooks should be distributed in all the villages. Prepare plans for the printing and supply of the passbooks. By March 5, all the districts should receive the passbooks.”

తెలంగాణ రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాలన్నింటిలోని అన్ని రకాల భూములకు సరైన లెక్కలుండాలని, ప్రతీ అంగుళం భూమికి ఎవరు యజమానో  తేల్చాలని ముఖ్యమంత్రి  కె. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. తెలంగాణ వ్యాప్తంగా చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో భూముల వివరాల నిగ్గు తేలిందని, ఇదే తరహాలో పట్టణాలు, నగర ప్రాంతాల్లో కూడా ప్రతీ భూమి తేల్చాలని సీఎం చేపట్టారు. మార్చి 11న రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పాస్ పుస్తకాల పంపిణీ చేపట్టాలని నిర్ణయించినందున, మార్చి 5 నాటికే పాస్ పుస్తకాలు జిల్లాలకు చేరే విధంగా కార్యాచరణ రూపొందించుకుని అమలు చేయాలని చెప్పారు. భవిష్యత్తులో భూ వివాదాలకు తావులేకుండా రికార్డులన్నీప్రక్షాళన చేయడంతో పాటు వాటిని పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు.

సరళమైన విధంగా ఉండే కొత్త పాస్ పుస్తకాలు, పహాణీల రూపకల్పన, భూ రికార్డుల ప్రక్షాళన తదనంతర కార్యక్రమాలు, ధరణి నిర్వహణ తదితర అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ముఖ్య కార్యదర్శులు  నర్సింగ్ రావు, శ్రీమతి శాంత కుమారి, రెవెన్యూ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారి, ల్యాండ్ రికార్డుల విభాగం డైరెక్టర్ శ్రీమతి వాకాటి కరుణ, మీ సేవ కమిషనర్  వెంకటేశ్వర్ రావు, రంగారెడ్డి కలెక్టర్  రఘునందన్ రావు, మేడ్చల్ కలెక్టర్ ఎంవి రెడ్డి, ఎమ్మెల్యే  ఆలం వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, ఎండిసి చైర్మన్  శేరి సుభాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

‘‘పాస్ పుస్తకాలు, పహాణీల్లో ప్రస్తుతం 31 కాలమ్స్ ఉన్నాయి. కాలక్రమేణా వచ్చిన మార్పుల కారణంగా చాలా కాలమ్స్ అవసరం లేదు. ప్రభుత్వం భూమి శిస్తు వసూలు చేసిన కాలంలో కొన్ని కాలమ్స్ అవసరం ఉండేది. మరికొన్ని కాలమ్స్ అవసరం కూడా ఇప్పుడు లేదు. ఇవన్నీ ఉండడం వల్ల అనవసర గందరగోళం ఏర్పడుతుంది. భూమి రికార్డులకు సంబంధించిన సమగ్ర సమాచారం ‘ధరణి’ ఉంటుంది. రైతుల వద్ద ఉండే పాస్ పుస్తకాలు, పహాణీలో అన్ని వివరాలు అవసరం లేదు. అత్యవసరం అనుకున్న వివరాలుంటే చాలు. రైతు పేరు, ఖాతా నంబరు, సర్వే నెంబరు, విస్తీర్ణం, భూమి పొందిన విధానం లాంటి కొన్ని ముఖ్యమైన కాలమ్స్ ఉంటే సరిపోతుంది. పాస్ పుస్తకాల్లో, పహాణీల్లో పరభాషా పదాలు చాలా వాడుతున్నారు. అవేమీ మన రైతులకు అర్థం కావు. కాబట్టి మన రైతులు వాడే పదాలనే పాస్ పుస్తకాలు, పహాణీల్లో వాడాలి. ఈ మార్పులతో కొత్త పాస్ పుస్తకాలు, పహాణీలు తయారు కావాలి’’ అని ముఖ్యమంత్రి సూచించారు. ఏ కాలమ్స్ ఉంచాలి, ఏ కాలమ్స్ తీసేయాలి అనే విషయంలో విస్తృత చర్చ జరిపి నిర్ణయం తీసుకున్నారు. దానికనుగుణంగానే కొత్త పాస్ పుస్తకాలు, పహాణీలు పంపిణీ చేయాలని, పాస్ పుస్తకంపైన ఖచ్చితంగా రైతు ఫోటో ఉంచాలని, ప్రతీ పాస్ పుస్తకానికి ప్రత్యేక నెంబరు కేటాయించాలని నిర్ణయించారు.

‘‘భూ రికార్డుల ప్రక్షాళన గొప్ప విజయం సాధించింది. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతీ ఇంచు భూమి లెక్క దొరికింది. 93 శాతం భూముల విషయంలో స్పష్టత వచ్చింది. కోర్టు కేసులు, ఇతర వివాదాల్లో ఉన్న భూములకు సంబంధించి పార్ట్ బి లో నిర్ణయం జరుగుతుంది. గ్రామీణ ప్రాంతాల్లోని భూ రికార్డులు దాదాపు క్లీన్ అయ్యాయి. ఇక పట్టణ, నగర ప్రాంతాలపై దృష్టి పెట్టాలి. ఇక్కడ కూడా ఏ భూమి ఎవరి ఆధీనంలో ఉందో తేల్చాలి. భూమి యజమానులను కూడా నిర్ధారించాలి. ప్రైవేటు ఆస్తులకు కూడా సర్వే నెంబర్ల తరహాలో ప్రత్యేక నెంబర్లు కేటాయించే విధానం తీసుకొచ్చే విషయాన్ని పరిశీలించాలి. భూ రికార్డుల ప్రక్షాళన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో భూ వివాదాలు తగ్గిపోతాయని ప్రభుత్వం భావిస్తున్నది. పట్టణాలు, నగరాల్లో కూడా ఈ వాతావరణం రావడానికి ఏమి చేయాలనే విషయంపై అధ్యయనం చేయాలి. తెలంగాణ భూభాగంలోని ప్రతీ ఇంచు ఎలా ఉంది. ఎవరి ఆధీనంలో ఉంది. అందులో ఎలాంటి కార్యకలాపం జరుగుతుంది. తదితర అన్ని వివరాలు ప్రభుత్వం వద్ద ఉండాలి’’ అని అధికారులను సీఎం కోరారు.

‘‘మార్చి 11న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో కొత్త పాస్ పుస్తకాల పంపిణీ జరగాలి. దీనికోసం పాస్ పుస్తకాల తయారీ, రవాణా తదితర కార్యక్రమాలను రూపొందించుకోవాలి. మార్చి 5 నాటికి జిల్లాలకు పాస్ పుస్తకాలు అందాలి’’ అని సీఎం ఆదేశించారు.

print

Post Comment

You May Have Missed