పులివెందుల: వైయస్ వివేకానందరెడ్డిపై జరిగిన ఘటన అత్యంత దారుణంగా, రాజకీయంగా జరిగిందని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో మా తాత రాజారెడ్డిని చంపింది టీడీపీ నేతలే అని, నాన్న దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డిని కూడా అసెంబ్లీలో బెదిరించారని, ఆ తరువాత రెండు రోజులకే హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారని, తనపై ఎయిర్‌పోర్టులో కత్తితో హత్యాయత్నానికి పాల్పడ్డారని వివరించారు. వైయస్ వివేకానందరెడ్డిని అత్యంత దారుణంగా చంపారని, ఈ ఘటనలో ఎవరు ఉన్నా మూలాలు తెలియాల్సిందే అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం లేదని, సీబీఐ విచారణ ఏర్పాటు చేయాలని వైయస్‌జగన్ డిమాండు చేశారు. పులివెందులలో ఆయన మీడియాతో మాట్లాడారు.
35 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగి, సౌమ్యుడిగా పేరు పొందిన మాజీ ఎంపీని ఇంట్లో ఎవరు లేని సమయంలో గొడ్డలితో న రికి అత్యంత దారుణంగా చంపడం ఎక్కడ ఉండదు. ఆయన వయసు చూసినా, వ్యక్తిత్వం చూసినా ఎవరూ కూడా చంపాలని ఆలోచన చేయరు. ఘటన ఇంత దారుణంగా జరిగితే..దర్యాప్తు జరిగిన ఘటన బాధాకరం. ఆయన చనిపోయే సమయంలో ఓ లెటర్ రాసినట్లు పోలీసు అధికారులు సృష్టించారు. చంద్రబాబు ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. మీ లెటర్ గురించి అడుగుతున్నాను. చిన్నాన్నను బెడ్ రూమ్‌లో గొడ్డలితో తలపై నరికారు. ఆ తరువాత తాను బాత్‌రూమ్‌లో రక్తం కక్కుక్కొని బాత్‌రూమ్‌లో మూర్ఛ వచ్చి చనిపోయినట్లు సృష్టించేందుకు ఎత్తెకెళ్లారు. బాత్ రూమ్‌లో కబ్‌బోర్డుకు రక్తం పూశారు. అంటే తాను మూర్చ వచ్చి కబ్‌బోర్డుకు కొట్టుకోని చనిపోయినట్లు క్రియెట్ చేశారు. ఆ సమయంలో చిన్నాన్న ఎలా లెటర్ రాస్తారు. చంపే వారి సమక్షంలో లెటర్ రాయగలడా? లెటర్ రాస్తుంటే చంపేవారు చూస్తూ ఊరుకుంటారా? డ్రైవర్‌పై నేరం నెపం నెట్టుతూ లెటర్ చూపించారు.
ఈ హత్యను పక్కదారి పట్టించేందుకు కుట్ర జరిగింది. అందుకే సీబీఐ విచారణ జరిపించాలని డిమాండు చేస్తున్నాను. నేను పోలీసు అధికారులతో మాట్లాడుతుండగా మూడుసార్లు అడిషనల్ డీజీ ఇంటలీజెన్సీ నుంచి ఫోన్లు వచ్చాయి. ఏబీ వెంకటేశ్వరరావు నుంచి వరుసగా ఫోన్లు వస్తున్నాయి. అందుకే నిజాలు బయటకు రావాలి. చేసిన వారు ఎంతటి వారైనా విషయాలు తెలియాలి. పద్ధతి ప్రకారం జరిగిన ఈ హత్యాను వెలుగులోకి తీసుకురావాలి. మొదట మా తాతను చంపారు. నాన్నను కట్టడి చేసేందుకు ఇలాంటి చర్యకు పాల్పడ్డారు. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండింది చంద్రబాబే. నాన్నను చంపింది కూడా అనుమానమే ఉంది. ఆ కేసు విచారణ చేసింది జేడీ లక్ష్మీనారాయణ. ఆ ఘటనకు రెండు రోజుల ముందు అసెంబ్లీలో చంద్రబాబు నాన్నను బెదిరించారు. ఈ విషయం ఈనాడులో వచ్చింది. ఆ తరువాత ఎయిర్‌పోర్టులో నన్ను చంపాలని చూశారు.
డైరెక్ట్‌గా కత్తి పట్టుకొని వచ్చి టీడీపీకి చెందిన వ్యక్తి నాపై దాడి చేశారు. దాన్ని కూడా వెటకారం చేస్తూ వీళ్లు మాట్లాడారు. ఈ ఘటనలన్నింటి వెనుక చంద్రబాబే ఉన్నారు. చేసింది ఎవరైనా కూడా మూలాలు బయటకు రావాలి. సీబీఐ విచారణ వేయాలి. స్వతంత్రంగా విచారణ చేస్తేనే నిజాలు బయటకు వస్తాయి. మీడియా ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైయస్‌ఆర్‌సీపీ శ్రేణులకు ఒక్క విషయం చెబుతున్నాను. దేవుడున్నారు. ఆయనపై నమ్మకం ఉంది. . ప్రతి ఒక్కరూ సంయమనం పాటించాలని వైయస్ జగన్ కోరారు. (వైయస్‌ఆర్ కాంగ్రెస్ )