ప్రజాపాట, చైతన్యం మిగిల్చి వెళ్ళిపోయిన వంగపండు
- జానపద శిఖరం ప్రజా మాష్టారు వంగపండు ప్రసాదరావు ఈ తెల్లవారుజామున మనల్ని విడిచి వెళ్లిపోయారు.
*ప్రముఖ వాగ్గేయకారుడు వంగపండు (77) ఇకలేరు అన్న వార్త కలచివేసింది.
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వాగ్గేయకారుడు.
పార్వతీపురంలోని తన నివాసంలో గుండెపోటుతో వంగపండు మృతి.
వందలాది జానపదపాటలను రచించిన వంగపండు.
ఉత్తరాంధ్ర జానపదాలకు గజ్జెకట్టి పాడిన వంగపండు.
పల్లెకారులతో పాటు గిరిజనులనూ చైతన్యపరిచిన వంగపండు.
విప్లవకవిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో పేరుపొందిన వంగపండు.
1943లో పెదబొండపల్లిలో జన్మించారు.
అర్థరాత్రి స్వతంత్య్రం సినిమాతో వంగపండు సినీ ప్రస్థానం.
2017లో కళారత్న పురస్కారం.
1972లో జననాట్యమండలిని స్థాపించిన వంగపండు.
మూడు దశాబ్ధాలలో 300 పాటలు రచించిన వంగపండు.
ఏం పిల్లడో ఎల్దమొస్తవ పాటతో ప్రఖ్యాతి చెందిన వంగపండు.
వంగపండు మృతి పట్ల ప్రజా కళాకారులు ఆవేదన ప్రకటించారు.
Post Comment