గుంటూరు: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేద, మధ్య తరగతి కుటుంబాలకు భారీ వైద్య పథకం ప్రకటించారు. మనందరి ప్రభుత్వం రాగానే రూ.5 లక్షల్లోపు ఆదాయం ఉన్న వారికి యూనివర్సల్ హెల్త్‌కార్డులు అందజేస్తామని హామీ ఇచ్చారు. నెలకు రూ.40 వేలు జీతం ఉన్న వారికి ఉచితంగా వైద్యసేవలు అందిస్తామని మాట ఇచ్చారు. ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణకు పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు చేస్తామని, స్వయంగా ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోనే పర్యవేక్షణ కమిటీ ఉంటుందని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం గుంటూరు నగరంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రసంగించారు.