వైయస్ఆర్ జిల్లా: పులివెందులలో మొదటి ఇనిస్టాల్మెంట్ కింద రూ.1329 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాం. నాన్నను మీరంతా అమితంగా ప్రేమించారు. నాన్న చనిపోయిన తరువాత నాకు ఎవరూ లేరన్న సందర్భంగా మీ వెనక మీమంతా ఉన్నామని కుటుంబంలా తోడుగా నిలబడ్డారు. మీ బిడ్డ ఈ రోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యాడు. మీ బిడ్డకు మీ అందరి రుణం తీర్చుకుంటున్నందుకు ఈ రోజు చాలా సంతోషంగా ఉంది. రాబోయే రోజుల్లో మిగిలిన అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతాం. గండికోట డ్యామ్ దిగువన 20 టీఎంసీల నీటి సామర్థ్యం గల ప్రాజెక్టుకు రాబోయే రోజుల్లో శంకుస్థాపనలు చేస్తామని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. పులివెందులలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన అనంతరం సీఎం మాట్లాడారు.