×

 పిల్లలు స్కూల్కి, తల్లిదండ్రులు పనికి వెళ్లాలి : మహేష్ భగవత్ పిలుపు

 పిల్లలు స్కూల్కి, తల్లిదండ్రులు పనికి వెళ్లాలి : మహేష్ భగవత్ పిలుపు

 పిల్లలు స్కూల్కి, తల్లిదండ్రులు పనికి వెళ్లాలని రాచకొండ సీపీ మహేష్ భగవత్ పిలుపు ఇచ్చారు . చదువును అజాగ్రత చేయవద్దని, ఆ చదువే వారి భవిషత్తుని నిర్ధారిస్తుందని ఆయన అన్నారు . ఒరియా పిల్లలకోసం మహేష్ భగవత్ బడి పంతులు అయ్యారు. మంగళవారం  రాచకొండ కమిషనరేట్ పరిధిలోని  చీకటి మామిడి గ్రామంలో ఇటుకబట్టిలో పనిచేస్తున్న ఒరిస్సా కార్మికుల పిల్లలకోసం వారి భాషకు అనుగుణంగా ఒర్రిస్స అధికారులతో మాట్లాడి అక్కడి నుంచి టీచర్లను  ఇక్కడకు  పిలిపించి  పాఠాలు చెప్పిస్తున్నారు .సంబంధిత  పాఠశాలను, స్థానిక ఎమ్మెల్యే గొంగిడి సునీత, యాదాద్రి జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్, కార్మిక శాఖ  అధికారులు ప్రారంభించారు. గత ఏడాది  వారి పరిస్థితి  చూసి  రాచకొండ సీపీ ఈ నిర్ణయం తీసుకున్నారు . వారికి పాఠాలు చెప్పే సమయంలో ఒరియా భాషను విని వారితో కొన్ని పదాలను వారితో మాట్లాడి ఆశ్చర్యపరిచారు.  స్వచ్చంధ సంస్థ ప్రతినిధి సురేష్ ఒడిశా నుంచి  ముగ్గురు టీచర్లను అందుబాటులోకి తెచ్చినందుకు సంతోషం ప్రకటించారు .  గతంలో పెద్ద కొండూరు, ఆదిభట్ల రావీర్యాలలో 800 మంది పిల్లలకు పైగా విముక్తి కల్పించి జాయిన్ చేశామని  అన్నారు.నడుస్తున్నాయని అన్నారు. ఈ స్కూల్ లను చూసి నోబెల్ బహుమతి గ్రహీత కైలాష్ సత్యర్ధి అభినందనలు తెలిపారన్నారు. ఈ పాఠశాలలను ఆదర్శనంగా తీసుకుని తెలంగాణలో మరికొన్ని పాఠశాలలు స్థాపిస్తున్నారని అన్నారు. పిల్లలకు బ్యాగ్ లు, పుస్తకాలు, పలకలు అందించారు. డీసీపీ యాదాద్రి రాంచెంద్రారెడ్డి  తదితరులు పాల్గొన్నారు.

యాదగిరిగుట్టలో కొత్త  ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ :
యాదగిరిగుట్టలో కొత్త   ట్రాఫిక్ పోలీసు స్టేషన్ ను రాచకొండ సిపి మహేష్ భగవత్ ప్రారంభించారు. తాగి వాహనాలను నడపరాదని ఆయన అన్నారు.  కార్యక్రమంలో యాదాద్రి డీసీపీ రామచంద్రారెడ్డి, ఏసీపీ శ్రీనివాసా చార్యులు, సి. ఐ.లు ఎస్. ఐ.లు తదితరులు పాల్గొన్నారు.
print

Post Comment

You May Have Missed