పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతి దోహదపడుతుంది
గణపతి నవరాత్రులలో మట్టి గణపతినే పూజించండి
తెలంగాణ రాష్ట్ర హోమ్ ప్రిన్సిపాల్ సెక్రెటరీ, ఐ.పి.ఎస్ అధికారి శ్రీ రాజీవ్ త్రివేది
హైదరాబాద్ ఆగష్టు 23(ఎక్స్ ప్రెస్ న్యూస్): పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతి దోహదపడుతుందని తెలంగాణ రాష్ట్ర హోమ్ ప్రిన్సిపాల్ సెక్రెటరీ, ఐ.పి.ఎస్ అధికారి శ్రీ రాజీవ్ త్రివేది పేర్కొన్నారు. బుధవారం ఉదయం వాసవి సేవ సంఘం, స్ఫూర్తి సేవ సంఘం హైదరాబాద్ సెక్రటరీ బి.పురుషోత్తం ఆద్వర్యం లో వెంకటగిరిలో మట్టి గణపతులు ఉచిత పంపిణి కార్యక్రమం జరిగింది. ముఖ్యఅతిధిగా విచ్చేసిన రాజీవ్ త్రివేది మాట్లాడుతూ క్రమం తప్పకుండా గత కొన్నేళ్లుగా మట్టి గణపతి గురించి చేస్తున్న ప్రచారం, మట్టి గణపతులు పంపిణి అభినందనీయమని, చేసే పనిలో దేశ భవిష్యత్ దృష్టిలో పెట్టుకొని యువత పనిచేయాలని ఈ విధంగా పనిచేస్తున్న యువతను అభినందించారు, గణపతి పూజకు, ఉత్సవాలకు యువత ఎంతోఆసక్తి చూపుతారని ఆ యువతే సమాజం కోసం ఆలోచించాలని, ప్రతి ప్రాంతం లో మట్టి గణపతులనే ప్రతిష్టించాలని, పూజలు కూడా మట్టి గణపతికి చేయాలన్నారు. పర్యావరణానికి ఎంతో చేయూతనిచ్చే మట్టి గణపతిని కాకుండా విషపూరిత రంగులతో కూడిన ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు నిషేధించాలన్నారు. మట్టి గణపతి ని ప్రోత్సహించడం నేడు చాల అవసరమని స్ఫూర్తి ప్రతినిధులు గత కొంతకాలంగా చేస్తున్నఅవగాహన కార్యక్రమాలు అభినందనీయమన్నారు. కార్యక్రమం లో జూబ్లీహిల్స్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్.వెంకటరెడ్డి, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హైదరాబాద్ జిల్లా చైర్మన్ మామిడి భీంరెడ్డి మాట్లాడుతూ సమాజాభివృద్ధికి యువత నడుంబిగించాలని, సంఘం యువత చేస్తున్న కార్యక్రమాలు వలే ప్రతి ఒక్కరు పర్యావరణానికి, దేశాభివృద్ధికి కృషి చేయాలన్నారు. అనంతరం మట్టి గణపతులను పంపించేశారు. కార్యక్రమం లో సంఘం ప్రతినిధులు బి.పురుషోత్తం, స్ఫూర్తి తెలుగు రాష్ట్రాల కన్వీనర్ పి.గంగయ్య, సోషల్ వర్కర్ పుట్టారామకృష్ణ మాట్లాడుతూ ప్రతి యువజన సంఘం మట్టి గణపతిని ప్రమోట్ చెయ్యాలని, హైదరాబాద్ లో స్ఫూర్తి మట్టి గణపతి ప్రచారం పై సంతృప్తి వ్యక్తం చేశారు. చాల జిల్లాలలో స్ఫూర్తి సభ్యులతో మట్టి గణపతి ప్రచారం జరుగుతుందని, వచ్చే 5 ఏళ్లలో వంద శాతం మట్టి గణపతులు ఉండేవిధంగా అవగాహనా తో ప్రచారం చేస్తున్నామన్నారు. యూసఫ్ గూడా ప్రభుత్వ స్కూల్ NCC విద్యార్థులు ఆఫీసర్ ప్రభాకర్ ఆద్వర్యం పాల్గొన్నారు. వాసవి , స్ఫూర్తి , రెడ్ క్రాస్ ప్రతినిధలు వెంకట్రావు, రమణ,సాయి, మహేష్, యతిరాజ్, జగన్ , వెంకట రమణ రెడ్డి, ప్రభాకర్, ఏ.కళ్యాణ్ యాదవ్, ఈశ్వర్, స్ఫూర్తి సేవ సంఘం, రెడ్ క్రాస్ సభ్యులు పాల్గొన్నారు .