పనిని భారంగా కాకుండా బాధ్యతగా చేయాలి – ఏపీ సీఎం చంద్రబాబు

* మాతా శిశుమరణాల రేటును 0 శాతానికి తగ్గించాలి
అమరావతి, జూన్ 12: మాతా శిశుమరణాల రేటులో (ఎ.ఎం.ఆర్, ఐఎం.ఆర్) దేశంలో 9వ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ను నాలుగేళ్లలో 4 వ ర్యాంకుకు తీసుకొచ్చామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కేరళను అధిగమించి నెంబర్-1 స్థానం చేరుకోవాలని, ‘0’ స్థాయికి తీసుకెళ్లాలని సీఎం  కోరారు. ఉద్యోగులందరూ తనతో పాటు కష్టపడటంతో నాలుగేళ్లలో రాష్ట్రాన్ని అనేక రంగాల్లో ఉన్నత స్థాయికి తీసుకురాగలిగినట్లు ముఖ్యమంత్రి చెప్పారు. నాలుగేళ్లుగా తమ ప్రభుత్వం తీసుకున్న చర్యలతో, మేలిమి పద్ధతులతో  విద్యారంగంలో నెంబర్-1 స్థానం కైవసం చేసుకున్నామని చంద్రబాబు వివరించారు.
వైద్య ఆరోగ్య శాఖ ఎ.ఎన్.ఎంలు,  కాంట్రాక్టు కార్మికులు, పొరుగు సేవల సిబ్బందికి వేతనాలు పెంచినందుకు, పి.ఆర్.సి ఎరియర్స్ ఇవ్వనున్నట్లు ప్రకటించిన ముఖ్యమంత్రిని ఉద్యోగులు మంగళవారం సాయంత్రం సచివాలయంలో సత్కరించారు. తాను రాత్రి నిద్రించే సమయంలో తప్ప రోజంతా కష్టపడతానని, పని చేయటంలో ఆనందం పొందుతానని చెప్పారు. పనిని భారంగా కాకుండా బాధ్యతగా చేయాలని, కష్టపడినా ఇష్టపడి పనిచేయాలని విజ్ఞప్తి చేశారు.   ఉద్యోగుల సంక్షేమ బాధ్యత ప్రభుత్వం చూసుకుంటుందని,  ప్రజల ఆరోగ్య భద్రత, మాతా శిశుమరణాల రేటు తగ్గించే బాధ్యతను ఏఎన్ఎంలు, ఉద్యోగులు, కార్మికులు చూసుకోవాలని కోరారు.  ‘ఈ నాలుగేళ్లుగా మీరెంతో కష్టపడి పనిచేశారు. మీ సేవలకు గుర్తింపుగానే రాష్ట్రంలో 13,000 మంది కాంట్రాక్టు, పొరుగుసేవల సిబ్బందికి వేతనాలు పెంచాం.  ఆర్ధికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ మీ సేవలను పరిగణనలోకి తీసుకుని, ప్రోత్సాహకంగా ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని ముఖ్యమంత్రి అన్నారు. గర్భిణుల సుఖప్రసవానికి, తల్లీ, బిడ్డలు సురక్షితంగా ఇంటికి చేరడానికి ఎ.ఎన్.ఎం లు సహకరించాలని చంద్రబాబు కోరారు. నాలుగేళ్ల తన పరిపాలనలో టెక్నాలజీని ఉపయోగించుకుని ఉద్యోగుల మీద పనిభారం లేకుండా చేశామని, ఉద్యోగులు ఆనందంగా గడపడానికి హ్యాపీ సండే నిర్వహిస్తున్నామని తెలిపారు. గర్భిణులు ప్రసూతి సమయంలో సెలవులో ఉన్న రెండు నెలలకు పూర్తి వేతనాన్ని చెల్లిస్తున్నామని వివరించారు. దేశంలో అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ చిరునామాగా నిలిచిపోవాలి. మీరంతా  మనసు పెట్టి పనిచేయండి. మీ బాధ్యత నేను చూసుకుంటాను. మీరు ప్రజలు సంతోషంగా ఉండేలా ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అమలు చేయండి.   మీరు కష్టపడి పనిచేస్తేనే రాష్ట్రాభివృద్ధిని కొనసాగించేందుకు ప్రభుత్వానికి మళ్లీ ప్రజల ఆశీర్వాదం అందజేస్తారు.  మీ బాగోగులు, సంక్షేమాన్ని మన ప్రభుత్వం చూసుకుంటుంది’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైద్య ఆరోగ్య శాఖ ఎ.ఎన్.ఎంలు, ఇతర విభాగాల ఉద్యోగులను కోరారు. మహిళలు నాయకత్వ లక్షణాలతో ఎదగాలన్నది తమ విధానమని, ఉద్యోగులు తమను నమ్ముకున్న  కుటుంబ సభ్యులను మంచిగా చూసుకోవాలని, అదే సమయంలో  ప్రభుత్వ పథకాల ద్వారా రాష్ట్ర ప్రజలను శ్రద్ధగా చూడాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. నాలుగేళ్ల నాడు ఏమీ లేని స్థితి నుంచి కష్టపడి సంపద సృష్టించామని, సంపద సృష్టి లేకుంటే వెనుకబడి పోతామని, ఎన్ని ఇబ్బందులు ఉన్నా అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోకుండా చూశామని, పెన్షన్లు, జీతాలు ఒకటో తేదీకే చెల్లిస్తున్నామని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్ నెంబర్-1గా తీర్చిదిద్దేందుకు కష్టపడుతున్నమని, అందరి కష్టంతోనే ఇవాళ రాష్ట్రం అభివృద్ధి పధంలో పయనిస్తోందని అన్నారు.  ప్రజలు శహభాష్ అనే విధంగా పనిచేయాలని ఉద్యోగుల కృషిని ప్రభుత్వం గుర్తించి ప్రోత్సహిస్తుందని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. పరిపాలన మీద, సంక్షేమ పథకాల అమలుపై అత్యధిక సంతృప్తి శాతం తీసుకురావాలని తాము చెప్పేది ఇందుకేనన్నారు. ఉద్యోగులకు పనిభారంగా అన్పిస్తే సాధికారమిత్రల సహాయం తీసుకోవాలని, పనిలో వారి భాగస్వామ్యం తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు.
అమరావతి : ‘ఒంగోలు డెయిరీ’ పునర్‌వైభవానికి ముఖ్యమంత్రి చంద్రబాబు చర్యలు*డెయిరీని కష్టాల నుంచి గట్టెక్కించేందుకు పూర్తి సహకారం అందించాలని నిర్ణయం *రైతులు, ఉద్యోగుల బకాయిలు చెల్లించేందుకు ఆమోదం తెలిపిన ముఖ్యమంత్రి*త్వరలోనే పాడి రైతులు-ఉద్యోగుల బకాయిల చెల్లింపు, డెయిరీ పునరుద్ధరణ*ఈ దిశగా చర్యలు చేపట్టాలని ప్రకాశం జిల్లాకు చెందిన మంత్రి శిద్దా రాఘవరావు, అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశం
ముఖ్యమంత్రి చంద్రబాబును సచివాలయంలో కలసిన ఆంధ్రప్రదేశ్ విద్యుత్తు కాంట్రాక్టు కార్మికుల ఐక్యవేదిక సభ్యులు* తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించిన విద్యుత్త కాంట్రాక్టు కార్మికుల ఐక్యవేదిక కమిటీ సభ్యులు*సమానపనికి సమానవేతనం, పీస్ రేట్ రద్దు చేయాలని , కాంట్రాక్టు కార్మికులకు నేరుగా చెల్లింపులు చేయాలని కోరుతూ వినతిపత్రం సమర్పించిన విద్యుత్తు కాంట్రాక్టు కార్మికుల ఐక్యవేదిక సభ్యులు*
అమరావతి: ఉండవల్లి గ్రీవెన్స్ సెల్ లో ముఖ్యమంత్రి చంద్రబాబును కలసిన ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ సభ్యులు* రిటైర్మెంట్ సమయంలో హాఫ్ పే లీవ్ ను నగదుగా మార్చుకోవటానికి ఉత్తర్వులు జారిచేసిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు త్లిపారు .
అమరావతి: సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలసిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మహిళా ఉద్యోగుల సంక్షేమ సంఘ బృందం, కాంట్రాక్టు, పొరుగుసేవల సిబ్బందికి వేతనాలు పెంచినందుకు కృతజ్ఞతలు చెబుతూ సత్కరించిన వైద్య ఆరోగ్య శాఖ మహిళా ఉద్యోగులు; పి.ఆర్.సి వేతం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపిన వైద్య ఆరోగ్య శాఖ మహిళా ఉద్యోగుల సంక్షేమ సంఘం సభ్యులు, పొరుగు సేవలు, కాంట్రాక్టు  ఉద్యోగులలో గర్భిణులకు,బాలింతలకు  2 నెలల ప్రసూతి సెలవు మంజూరు చేసినందు ధన్యవాదాలు చెబుతూ ముఖ్యమంత్రిని సత్కరించిన  వైద్య ఆరోగ్య శాఖ మహిళా ఉద్యోగుల సంక్షేమ సంఘం సభ్యులు,ఏఎన్ఎం లను శాశ్వత పద్ధతిలో నియమించాలని కోరిన సంఘ సభ్యులు,మహిళా ఫీల్డ్ స్టాఫ్‌కు సబ్సిడీపై ద్విచక్రవాహనాలు సమకూర్చాలని విజ్ఞప్తి,సబ్ సెంటర్ల అద్దె సొమ్ము మొత్తాన్ని రూ.200 నుంచి రూ.2000 పెంచాలి,ఖాళీగా ఉన్న ఎంపీహెచ్ఎ పోస్టులు భర్తీ చేయాలి, ఎ.ఎ.ఎం లకు, పొరుగు సేవల ఉద్యోగులకు ఎన్టీఆర్ వైద్యసేవ పథకాన్ని వర్తింపజేయాలి, విధి నిర్వహణలో ఉండి మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు ఆర్ధిక సహాయం చేసి ఉపాధి దారి చూపాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేసారు .వైద్య ఆరోగ్య శాఖ మహిళా ఉద్యోగుల సమస్యలను సానుభూతితో పరిశీలిస్తామని హామీ ఇఛ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.సంఘ  అధ్యక్షురాలు రేణుకాదేవి, ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి ఆధ్వర్యంలోరాష్ట్రం లోని  9 జిల్లాల నుంచి వచ్చి ముఖ్యమంత్రిని  కలసిన ప్రతినిధిబృంద సభ్యులు ,వేతనాలు పెంచినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు నేతల కృతజ్ఞతలు తెలిపారు .కేక్ కట్ చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు,కార్యక్రమం లో పాల్గొన్న ముఖ్యమంత్రి కార్యదర్శి గిరిజా శంకర్., వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి పూనం మాలకొండయ్య.
The Chief Minister met with officials from Kia Motors India, who informed him that by January 2019, the first car made in India will be ready. They also presented a brief progress report of the various modules of the project in Anantapur. 65.3% of the Assembly Shop, 63.1% of the Paint Shop, 65.1% of the Body Shop and 64.1% of the Press have been completed. Other parts of the project include the Engine Shop, the Head Office, Manual Transmission, Seats, Coil Centre, Test track and the township with residential buildings.
The Chief Minister directed officials from the Industries department to ensure that there is real-time updation of the physical progress of the project. He also spoke the Collectorate office of Anantapur through video conference and urged them to resolve land acquisition issues. He also congratulated all officials for making sure that the project is ahead of schedule.
Kia Motors India and AP State Skill Development Corporation (APSSDC) will start a Basic Training Course in the automobile sector on June 20th. This course will admit students only from the Anantapur district to enhance their skills.
print

Post Comment

You May Have Missed