పంచమఠాల పునర్నిర్మాణ పనులు నాణ్యతతో త్వరగా పూర్తి చేయాలి – ఈ ఓ
శ్రీశైల దేవస్థానం: పంచమఠాల పునర్నిర్మాణ పనులు నాణ్యతతో త్వరగా పూర్తి చేయాలని శ్రీశైల దేవస్థానం ఈ ఓ ఆదేశించారు. శ్రీశైల క్షేత్ర అభివృద్ధి పనులలో భాగంగా దేవస్థానం చేపట్టిన పంచమఠాల పునర్నిర్మాణ పనులను ఈ రోజు కార్యనిర్వహణాధికారి పరిశీలించారు. ప్రాచీన కట్టడాల పరిరక్షణలో భాగంగా ఈ పునర్నిర్మాణ పనులుచేపట్టారు.ప్రాచీన నిర్మాణ శైలికి ఎలాంటి విఘాతం కలగకుండా ఈ పునర్నిర్మాణ పనులు చేపట్టారు. పంచమఠాలలో విభూతిమఠ పునర్నిర్మాణ పనులు దాదాపు 80 శాతం పూర్తికాగా, రుద్రాక్షమఠ పునర్నిర్మాణ పనులు 90శాతం దాకా పూర్తయ్యాయి. ఘంటామఠం పనులు దాదాపు 50శాతం దాకా పూర్తయ్యాయి.ప్రస్తుతం విభూతిమఠములో రాతిబండపరుపు పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే రుద్రాక్షమఠములో బండపరుపు పనులు పూర్తయ్యాయి.ఇక నిర్మాణపరంగా బాగానే వున్న భీమశంకరమఠానికి కూడా తగు మరమ్మతులు చేస్తున్నారు.
ఈ పునర్నిర్మాణ పనులు పూర్తయిన వెంటనే పచ్చదనం ఏర్పాటు, కాలిబాట రహదారి నిర్మాణ పనులు ప్రారంభిస్తారు. అదేవిధంగా ఆకర్షణీయమైన లైటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ తక్కిన పునర్నిర్మాణ పనులు త్వరలో పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అదే సమయములో పనుల నాణ్యత పట్ల పూర్తి శ్రద్ధ కనబర్చాలన్నారు.పునర్నిర్మాణ పనులు పూర్తయిన వెంటనే చుట్టూ ప్రాకారాన్ని నిర్మించేందుకు తగిన ప్రణాళికలు రూపొందించాలన్నారు.ఇంకా భక్తులందరు పంచమఠాలను ఒకేసారి దర్శించుకునేందుకు వీలుగా అన్ని మఠాలను కలుపుతూ (ఒకే సర్కూట్ గా) ఏక రహదారిని నిర్మించేందుకు వీలుగా వెంటనే ప్రణాళికను సిద్ధం చేయాల్సిందిగా కూడా ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. విభూతిమఠం ముందుభాగంలో గల ప్రాచీన మెట్ల మార్గానికి కూడా తగు మరమ్మతులు చేపట్టి, ఆ మార్గాన్ని పునరుద్ధరించాలని కూడా కార్యనిర్వహణాధికారి ఆదేశించారు.ఈ పరిశీలనలో కార్యనిర్వహణాధికారి తో పాటు దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు పి. మురళీ బాలకృష్ణ, సహాయ స్థపతి ఐ.యు.వి. జవహర్ లాల్ తదితరులు పాల్గొన్నారు.
Post Comment