శ్రీశైలం లో వరుణయాగం

వర్షాలు సమృద్ధిగా కురిసి తెలుగు రాష్ట్రాలతోపాటు దేశం సుభిక్షంగా ఉండాలన్నఆకాంక్షతో శ్రీశైల దేవస్థానం ఈ నెల రెండో తేదీ నుంచి ఆరో తేదీ వరకు వరుణ యాగం తలపెట్టింది. ఇందుకు ఏర్పాట్లను  ఈ ఓ , ఇతర అధికారులు ఈ రోజు పర్యవేక్షించారు. తిరుమల తిరుపతి దేవస్థానం వేద పండితులు బ్రహ్మశ్రీ ఉపాధ్యాయుల కాశీపతి సోమయాజి  శర్మ వారి పర్యవేక్షణలో ఈ యాగం నిర్వహిస్తారు. పలు ప్రాంతాలకు చెందిన ప్రసిద్ధులైన 55 మంది ఋత్వికులు ఇందులో పాల్గొంటారు. ఆలయ ప్రాంగణంలోని అక్క మహాదేవి  అలంకార మండపంలో యాగం జరుపుతారని దేవస్థానం ఎడిటర్, మీడియాకు తెలిపారు. ప్రతిరోజు వేద పారాయణాలు, వరుణ జపాలు ,ఋష్యశృంగ జపాలు , మహా భారతంలోని విరాట పర్వ పారాయణాలు నిర్వహిస్తారు . ఈ ఓ ఆదేశాల మేరకు ఏర్పాట్లు చేసారని ఎడిటర్ తెలిపారు.

*Dr. M. Padma,IAS, Commissioner, Endowments Dept.Govt.of A.P. visited the temple today. E.O. , other officials and staff received with aalaya maryaadha.

  • several puja events performed in the temple today.
  • Sree Nataraja Nruthya Kalaashaala, Srisailam presented Kuchipudi dance under kalaaraadhana programme.
print

Post Comment

You May Have Missed