×

నిరంతరం పర్యవేక్షణతో శాఖల పనితీరు సమర్థవంతంగా ఉంటుంది.శ్రీశైల దేవస్థానం ఈ ఓ

నిరంతరం పర్యవేక్షణతో శాఖల పనితీరు సమర్థవంతంగా ఉంటుంది.శ్రీశైల దేవస్థానం ఈ ఓ

శ్రీశైల దేవస్థానం: శ్రీశైల దేవస్థానం పరిపాలనా సంబంధిత  అంశాలపై  కార్యనిర్వహణాధికారి ఈ రోజు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.పరిపాలనా భవనములోని సమావేశమందిరంలో జరిగిన ఈ సమీక్షా సమావేశం లో అన్ని విభాగాల అధిపతులు, పర్యవేక్షకులతో పాటు వివిధ విభాగాలలో విధులు నిర్వహిస్తున్న గుమాస్తాస్థాయి సిబ్బంది కూడా పాల్గొన్నారు. ఈ సమీక్షలో కార్యనిర్వహణాధికారి  పలు  అంశాలను ఆయా విభాగాల వారీ గా సమీక్షించారు. కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ ప్రతి ఉద్యోగి కూడా పారదర్శకంగా, బాధ్యతాయుతంగా, జవాబుదారితనంతో తమ విధులు నిర్వర్తించాలన్నారు. శాఖాధికారులు (యూనిట్ అధికారులు), పర్యవేక్షకులు వారి వారి విభాగాలను నిరంతరం పర్యవేక్షిస్తుండాలన్నారు. నిరంతరం పర్యవేక్షణ వల్ల శాఖల పనితీరు సమర్థవంతంగా ఉండగలుగుతుందన్నారు.

ముఖ్యంగా వివిధ విభాగాలకు సంబంధించిన ఆడిట్ అభ్యంతరాల గురించి సుదీర్ఘంగా చర్చించారు. అన్ని విభాగాల వారు ఆయా ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన ఆడిట్ అభ్యంతరాలకు సమాధానాలను రూపొందించి, ఆయా అభ్యంతరాలను తొలగింపజేసేందుకు అన్ని విభాగాల అధికారులు ప్రత్యేకశ్రద్ధ కనబర్చాలన్నారు. ఆడిట్ అభ్యంతరాల సమాధానాలను రూపొందించేందుకు పాతరికార్డులను పరిశీలించాల్సిన అవసరం ఉంటుందని, అందుకే రికార్డు రూమును క్రమపద్ధతిలో నిర్వహించాలన్నారు. అన్ని విభాగాల పాతరికార్డులన్ని సంవత్సరాలవారిగా వెంటనే అందుబాటులో ఉంచాలని రికార్డు విభాగాన్ని ఆదేశించారు. ప్రతి విభాగాధికారి, పర్యవేక్షకులు వారి వారి విభాగాలలోని సిబ్బంది రోజువారి హాజరుపట్ల తగు పరిశీలన చేయాలన్నారు. ముఖ్యంగా ఉద్యోగులందరు సమయపాలనను తప్పనిసరిగా పాటించాలన్నారు.అదేవిధంగా ప్రతి విభాగాధికారి కూడా వారి వారి విభాగాలలో ఎప్పటికప్పుడు జమా ఖర్చులను పరిశీలించాలన్నారు. దీని వలన దేవస్థానం రాబడి వ్యయాలపై విభాగాధిపతులందరికీ అవగాహన కలుగుతుందన్నారు.

ఈ సమావేశములో దేవస్థానం నిర్వహిస్తున్న పరోక్షసేవల గురించి కూడా కార్యనిర్వహణాధికారి సమీక్షించారు.అదేవిధంగా గోశాలనిర్వహణ, దేవస్థానం చేపట్టిన భద్రతా చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ, దేవస్థానం వెబ్ సైట్ ఆధునీకరణ మొదలైన వాటిని సమీక్షించారు.

print

Post Comment

You May Have Missed