×

 నాటి మొక్కలే నేడు చెట్లుగా ఎదిగాయి..తన్మయం చెందిన మంత్రి పువ్వాడ అజయ్

 నాటి మొక్కలే నేడు చెట్లుగా ఎదిగాయి..తన్మయం చెందిన మంత్రి పువ్వాడ అజయ్

మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, నాటి మొక్కలు నేడు నీడనిస్తూ వాటి జీవితకాలం ప్రాణవాయువు అందిస్తుందని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు పేర్కొన్నారు.

ఆదివారం vVDO’s’s కాలనీ క్యాంపు కార్యాలయంలో CMRF చెక్కులు పంపిణీ చేయడానికి వచ్చిన మంత్రి పువ్వాడ 3వ విడత హరితహారంలో భాగంగా కార్యాలయ ఆవరణలో తాను నాటిన మొక్క(కదంబం) వద్ద కాసేపు ఆగి తన్మయం చెందారు. స్వతహాగా తాను వృక్ష ప్రేమికుడనని నేడు ఈ చెట్టును చూస్తే సంతోషంగా ఉందన్నారు. నాటి హరితహారంను గుర్తుచేసుకుని ఆనందం వ్యక్తం చేశారు. ఇలాంటి మహత్తర కార్యక్రమాన్ని చేపట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మీ మీ పరిధిలో ఇప్పటివరకు నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని కోరారు. హరిత తెలంగాణ దిశగా అందరూ కృషి చేయాలని, మొక్కలు నాటడమే కాదు… వాటి సంరక్షణ కూడా ఓ బాధ్యతగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.

print

Post Comment

You May Have Missed