నవంబర్‌ 1వ తేదీన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

తాడేపల్లి: కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.  నవంబర్‌ 1వ తేదీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకను తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలుగుతల్లి విగ్రహానికి పూలమాల వేసి అమరజీవి పొట్టిశ్రీరాములుకు నివాళులర్పించనున్నారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరిస్తారు. ఈ కార్యక్రమంలో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్, పాల్గొననున్నారు. ఆయా జిల్లాల్లో ఇన్‌చార్జి మంత్రులు, కలెక్టర్ల ఆధ్వర్యంలో అవతరణ దినోత్సవ వేడుకలు జరగనున్నాయి.

print

Post Comment

You May Have Missed