×

నగరం రూపు రేఖలు మార్చడంలో కలిసి ముందుకు సాగుదాం – మంత్రి కెటి రామారావు

నగరం రూపు రేఖలు మార్చడంలో కలిసి ముందుకు సాగుదాం – మంత్రి కెటి రామారావు

హైదరాబాద్ ఆగష్టు 31(ఎక్స్ ప్రెస్ న్యూస్): నగరం రూపు రేఖలు మార్చడంలో అందరం కలిసి ముందుకు సాగుదామని మున్సిపల్ శాఖ మంత్రి కెటి రామారావు ప్రజాప్రతినిధులను కోరారు. ఈ రోజు బేగంపేట మెట్రోరైల్ కార్యాలయంలో మల్కాజ్‌గిరి పార్లమెంటు నియోజకవర్గంలోని అభివృద్ది కార్యక్రమాలపైన పురపాలకశాఖ మంత్రి కెటి రామారావు అద్వర్యంలో ఈ రోజు  సుదీర్ఘ సమీక్ష నిర్వహించడం జరిగింది. మల్కాజ్‌గిరి నియోజక వర్గ పరిధిలోని శాసన సభ నియోజకవర్గాల యంఏల్యేలు, ఏంఎల్సీలు, నగర మేయర్, మంత్రి మహేందర్ రెడ్డిలు ఈ సమీక్ష సమావేశంలో పాల్గోన్నారు. ఈ సమావేశంలో నియోజక వర్గాల వారీగా సమీక్ష నిర్వహించారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం, రోడ్లు, వాటర్ వర్క్స్, ఎస్సార్డీపి, లో జరుగుతున్న అభివృద్ది కార్యక్రమాలు ఏవిధంగా ముందుకు వెలుతున్నాయి, మల్కాజ్‌గిరి పరిధిలోని ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాలను మంత్రి, యంఏల్యేలకు వివరించారు. ప్రభుత్వం చేపట్టిన అనేక అభివృద్ది కార్యక్రమాలను మరింత వేగంగా ముందుకు తీసుకుని వెళ్ళేందుకు ప్రజాప్రతినిధులంతా కృషి చేయాలని కోరారు. ఇందుకోసం అవసరం అయిన ప్రణాళికల రచన, కార్యక్రమాల అమలుపైన ఏప్పటికప్పుడు సమావేశం అయి చర్చిద్దామని మంత్రి వారికి తెలిపారు. మల్కాజ్‌గిరి నియోజకవర్గంలో సూమారు 40 వేల డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మిస్తున్నామన్నారు. మురికి వాడల్లో తమ స్ధలాలను ఇళ్ల నిర్మాణానికి ఇచ్చిన వారికే ఇళ్లు ఇస్తామన్నారు. ఇక నగరంలోని చుట్టుపక్కల కడుతున్న చోట పక్కా ప్రణాళిక ద్వారా అయా ప్రాంతాల్లోని పేదలకే అందిస్తామన్నారు. గతంలో మాదిరి సూదూరంగా కాకుండా క్యాచ్ మెంట్ ఏరియాలను ఏర్పాటు చేసుకుని సాద్యమైనంత దగ్గరలో ఇస్తామన్నారు. ఇందుకోసం పక్బందీ ప్రణాళిక తయారు చేయాలని అధికారులను కోరారు. గతంలో డబుల్ బెడ్ రూం ఇళ్లకు అప్లికేషన్ చేసుకొని వారికి  మరోసారి అవకాశం ఇవ్వాలని యంఏల్యేలు కోరారు. గతంలోనే లక్షలాది మంది అప్లికేషన్లు పెట్టుకున్నారని, మిగిలిన వారీకి దరఖాస్తు చేసుకునే అం శంలో విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని మంత్రి కెటి రామారావు తెలిపారు.

మల్కాజ్‌గిరి ప్రాంతంలో వాటర్ వర్క్స్ చేపట్టిన పనులను అధికారులు ప్రజాప్రతినిధులకు వివరించారు. నగరానికి అనుకున్న చుట్టుపక్కల మున్సిపాలీటీల్లో ప్రపంచ బ్యాంకు సహాకారంతో చేపట్టిన పనులను వేంటనే పూర్తి చేయాలని, పనులు జరుగుతున్నప్పుడు, రోడ్లు మరమత్తులు వేంట వేంటనే చేయాలని వారు కోరారు. నగర దాహార్తి తీర్చేందుకు కేశవపూర్ రిజర్వాయర్ సైతం మల్కాజ్‌గిరి కిందకు వస్తుందని తెలిపారు.  కంటోన్మెంట్ పరిధిలో నీటి సరఫరా పెంచేందుకు అవసరం అయితే వాటర్ బోర్డు బాధ్యత తీసుకుంటామని మంత్రి ఏంఏల్యే సాయన్నకు తెలిపారు.

ఏస్సార్డీపి ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన కార్యక్రమాలను అధికారులు, ఏంల్యేలకు వివరించారు. నియోజకవర్గాల వారీగా ఎస్సార్డీపి పనులపైన సమీక్ష నిర్వహించారు.  బాలనగర్ వద్ద నిర్మించేబోయే ఫైఓవర్కు ఎలాంటి నిధుల కొరత లేదని మంత్రి, ఏంల్యేలకు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి స్కైవేల కోసం అనుమతికై ప్రయత్నం చేస్తున్నామని, త్వరలోనే అనుమతి రాగనే, ఆ పనులు ప్రారంభం చేస్తామన్నారు. ఉప్పల్, షామీర్ పేట్, కొంపల్లి స్కైవేలన్ని మల్కాజ్‌గిరి నియోజకవర్గంలోనే వస్తున్నాయని మంత్రి తెలిపారు.

print

Post Comment

You May Have Missed