నకిలీ సర్టిఫికెట్ల తయారీ ముఠా సభ్యుల అరెస్ట్ – రాచకొండ సీపీ

* బీవీ ,హైదరాబాద్ *

నకిలీ సర్టిఫికెట్లు  తయారు చేస్తున్న 17 మంది సభ్యులున్న   అంతర్రాష్ట్ర ముఠాలో  ఆరుగురు  సభ్యులను అరెస్ట్ చేసినట్లు  రాచకొండ పోలీసు  కమిషనర్ మహేష్ భగవత్  మంగళవారం తెలిపారు . వివిధ రాష్ట్రాల నుంచి ,  32 యూనివర్సిటీల పేరుతో ఉన్న 160 నకిలీ సర్టిఫికెట్స్ స్వాధీనం చేసుకున్నామన్నారు . ఈ నకిలీ  సర్టిఫికెట్స్ దందా  అయిదు సంవత్సరాలుగా నడుస్తోంది . ఒక్కో సర్టిఫికెట్ కు  50 వేల నుంచి  లక్ష రూపాయలు తీసుకుంటున్నారని ఆరోపణలున్నాయి . కొందరిపై కేసులు నమోదు చేసి  మరికొన్ని విచారణ చేస్తున్నామన్నారు .ఎల్ బి నగర్ లోని రాచకొండ సిపి క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు .  మేడిపల్లి లో డీజిల్ ట్యాంకర్ పేలుడు కేసులో రాజు కులాల్ అనే వ్యక్తిపై పీడీ  యాక్ట్ నమోదు చేసినట్లు కమిషనర్ చెప్పారు .  తాళాలు వేసి ఉన్న  ఇళ్ళని   బైక్ పై   రెక్కీ నిర్వహించి చోరీలకు పాల్పడుతున్న నాగరాజు అనే పాత నేరస్తుడిని   చైతన్యపురి పోలీసులు  అదుపులోకి తీసుకున్నారన్నారు . ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న నలుగురు వ్యక్తులు రవీందర్ నాయక్,సంజీవ్,కీర్తి ధనరాజ్,  లిమా సాగర్ లని   అదుపులోకి తీసుకున్న సరూర్ నగర్ పోలీసులు, 6.5 లక్షల విలువైన బంగారు ఆభరణాలు,  45 వేల నగదు స్వాధీనం  చేసుకున్నారన్నారు . చైతన్య పురి పోలీసు స్టేషన్ పరిధిలో   ఐదుగురు  ముఠా గా ఏర్పడి  పలు బ్యాంకులలో   నకిలీ డాక్యుమెంట్లను ఇచ్చి  క్రెడిట్ కార్డులు/ డెబిట్   కార్డులు  తీసుకుని బ్యాంకులను మోసం చేస్తున్న ముఠాలో ఒకరిని  రాచ కొండ ఎస్ .ఓ .టి . పోలీసులు  అరెస్ట్ చేసినట్లు సీపీ చెప్పారు . నలుగురు పరారీలో  ఉన్నారన్నారు.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.