హైదరాబాద్ కేంద్రంగా దేశం నలుమూలలకు గులాబీ పరిమళాలు వెదజల్లుతామని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు . హైదరాబాద్ శివారు కొంపల్లి లో శుక్రవారం పార్టీ 17 వ ప్లీనరీలో మాట్లాడారు. ఈ దేశం అన్ని రంగాల్లో ప్రగతి సాధనకు తమ వంతు ప్రయత్నం చేస్తామన్నారు . ప్రతి పొలానికి నీరు అందాలని , నిరుద్యోగం అంతరించిపోవాలని అన్నారు. తాము పట్టు సాధిస్తామన్నారు . ఇప్పటికే ఈ తెలంగాణ పలు విజయాలు పొందిందన్నారు .