దీపేన సాధ్యతే సర్వం

*In response to the call given by the Prime Minister, all lights in the Rajbhavan are turned off today at 9 PM, and candles /diyas are lightened for 9 minutes. The Governor and all her family members attended the programme to express their solidarity and to demonstrate the country’s collective will to fight corona virus.The Governor also thanked all the citizens who have participated in  this programme in a big number  in the state.

*భారతదేశంలో కరోనా వ్యాప్తి నివారణకు జరుగుతున్న ఐక్య పోరాటానికి సంఘీభావ సంకేతంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదివారం రాత్రి ప్రగతి భవన్ లో జ్యోతి వెలిగించారు. ప్రధానమంత్రి నరేంద్రమోడి ఇచ్చిన పిలుపుమేరకు రాత్రి 9 గంటల నుంచి 9 నిమిషాల పాటు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కొవ్వొత్తి వెలిగించారు. కొవ్వత్తి పట్టుకుని కరోనాపై పోరాడుతున్న వారికి సంఘీభావం ప్రకటించారు. ముఖ్యమంత్రితో పాటు ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజెందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు జె.సంతోష్ కుమార్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్ కుమార్, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు ఎస్.నర్సింగ్ రావు, రామకృష్ణరావు, శాంత కుమారి, అడ్వకేట్ జనరల్ పి.ఎస్. ప్రసాద్ , అడిషనల్ అడ్వకేట్ జనరల్ రాంచందర్ రావు తదితరులు పాల్గొన్నారు.

*తాడేపల్లి:  ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపునకు సంఘీభావంగా ఏపీ సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి దీపం వెలిగించి దీపోత్సవంలో పాల్గొన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో రాత్రి 9 గంటల సమయంలో విద్యుత్‌ దీపాలు ఆర్పివేయగా సీఎం వైయస్‌ జగన్, అధికారులు దీపాలు వెలిగించి సంఘీభావం ప్రకటించారు.  రాష్ట్ర ప్రజలు కూడా రాత్రి 9 గంటలకు ఇళ్లలో లైట్లు ఆర్పి దీపాలు వెలిగించారు.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.