శంషాబాద్ లోని దివ్యసాకేతాన్ని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు శనివారం సందర్శించారు. ప్రత్యేక పూజలు జరిపారు. శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చిన జీయర్ స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు. ముందుగా కేసీఆర్ కు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. జూపల్లి రామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.