రాచకొండ కమిషనరేట్ ట్రాఫిక్ విభాగం అడిషనల్ డీసీపీ మనోహర్ యాదగిరిగుట్టలోని ప్రధాన కూడళ్లను పరిశీలించారు. యాదాద్రికి వచ్చే భక్తులకు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని, అందులో భాగంగా త్వరలో యాదగిరిగుట్టలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేస్తామన్నారు. గురువారం స్వామిఅమ్మవార్లను దర్శించుకున్నారు.